జగన్‌ ఓ హీరో.. అంటున్న ప్రపంచ ప్రఖ్యాత మోటివేషనల్‌ స్పీకర్‌ నిక్‌..!

మోటివేషనల్ స్పీకర్ నిక్ వుజిసిక్ గురించి ప్రపంచానికి తెలుసు.ఆయన ఇచ్చే ప్రసంగాలు చాలా మందిలో స్పూర్తిని నింపాయి.

రెండు చేతులు, కాళ్లు లేకున్నా తనదైన స్పీచ్‌లతో అందరినీ ఆకర్షిస్తుంటారు.ఆయన తాజాగా ఏపీలో పర్యటిస్తున్నారు.

ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్‌ను బుధవారం సీఎం అధికారిక నివాసంలో కలుసుకున్నారు.జగన్‌ హీరో అని ఆకాశానికి ఎత్తేశారు.

దీనికి సంబంధించిన కీలక విషయాలిలా ఉన్నాయి.వుజిసిక్ ఒక ఆస్ట్రేలియన్-అమెరికన్ సువార్తికుడు.

Advertisement

ప్రేరణ కలిగించే వక్త.అతడికి టెట్రా-అమేలియా సిండ్రోమ్‌ అనే అరుదైన వ్యాధితో జన్మించాడు.

ఇది ఉన్న వారికి చేతులు, కాళ్లు ఉండవు.ఇలాంటి అరుదైన రుగ్మత ఉన్నప్పటికీ వుజిసిక్ జీవితంలో ఏ మాత్రం వెనకడుగు వేయలేదు.

ముఖ్యమంత్రిని కలిసిన అనంతరం వుజిసిక్ మీడియాతో కీలక వ్యాఖ్యలు చేశారు.తాను దాదాపు 78 దేశాలు తిరిగానని, విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తున్న జగన్ మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని ఎక్కడా చూడలేదన్నారు.ఉన్నత లక్ష్యం కోసం సీఎం ఉన్నత ఆశయంతో పనిచేస్తున్నారని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌లోని 45 వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా సమాన అవకాశాలను కల్పించాలనే గొప్ప లక్ష్యంతో పనిచేస్తున్నారని వుజిసిక్ పేర్కొన్నారు.ప్రపంచ స్థాయి సౌకర్యాలతో కూడిన ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటికే గణనీయమైన ప్రగతి సాధించారని, ఈ విషయం అందరికీ తెలియాలని అన్నారు.‘యాటిట్యూడ్ ఈజ్ ఆల్టిట్యూడ్’ అనే తన జీవిత కథను పదవ తరగతి ఇంగ్లీషు పాఠ్యపుస్తకంలో పాఠ్యాంశంగా ప్రవేశపెట్టినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ భైరవం సినిమాతో సక్సెస్ సాధిస్తాడా..?
దీపావళి గిఫ్ట్‌తో తల్లిని సర్‌ప్రైజ్ చేసిన కొడుకు.. వీడియో చూస్తే ఫిదా..

విద్యారంగంలో పిల్లల ఎదుగుదలకు మంచి అవకాశాలున్నాయన్నారు.

Advertisement

తాజా వార్తలు