మీరు వర్కింగ్ ఉమేనా, లేదా హౌస్ వైఫా? అని అడిగితె...ఆమె ఇచ్చిన ఆన్సర్ కి ఫిదా అవ్వాల్సిందే.!

ఆమెను ఒకరు అడిగారు మీరు వర్కింగ్ ఉమేనా, లేదా హౌస్ వైఫా? అని.హా .

నేను కేవలం హౌస్ వైఫే కాని 24గంటలు వర్క్ చేసే హౌస్ వైఫే నేను ఒక అమ్మ నేను ఒక భార్య నేను ఒక కుమార్తె నేను ఒక కోడలు నేను ఒక అలరాం గడియారం నేను ఒక వంటామె నేను ఒక అంట్లుతోమె పనిమనిషి ని నేను ఒక టీచర్ నేను ఒక అకౌంటెంట్ నేను ఒక గుమాస్తా నేను ఒక వడ్దించే వేటర్ నేను ఒక ఆయా నేను ఒక నర్సు నేను ఒక గార్డనర్ నేను ఒక గూర్ఖ నేను ఒక కౌన్సిలర్ నేను నా భర్తకి శయనభాగస్వామి

అయినా చూడండి నాకు సి.యల్.లేదు, ఈ.యల్ లేదు సండెలేదు, పండుగ , అంతేకాదు నాకు జీతంలేదు.కాని ఎందుకో అందరూ అడుగుతారు ఇంట్లో కూర్చొని ఎం చేస్తావని? ఫలానా ఆవిడ ఇలా పనిచేస్తుంది, ఫలానా ఆవిడా అక్కడ ఉద్యోగం చేస్తుంది, ఫలానా ఆవిడ వ్యాపారం చేస్తుంది అని.మీరు కాళీగా ఉండే బదులు అలా పని చేయొచ్చు కదా అని.దయచేసి ఒకరిని మరొకరితో పోల్చకండి.అందరి ఆడవారి పరిస్థితులు ఒకేలా ఉండవు.

వాషింగ్ మెషిన్,మిక్సీలు వచ్చాక కూడా ఇంకేమి పని ఉంటుంది అంటారేమో .! మీ ఇంటి ఇల్లాలిని ఒక్క నెల రోజులు పుట్టింటింకి పంపించి అదే వస్తువులతో మీ ఇల్లాలి పని ఒక్కసారి మీరు చేసి చూడండి.మీ వంటగది చెప్తుంది మీ అమ్మ(గృహిణి) చేతి పని మీ పూజ గది చెప్తుంది మీ ఇల్లాలి చేతి పవిత్రత మీ బాత్రూం, మీ వాకిలి చెప్తుంది హౌస్ వైఫ్ వ్యాల్యూ ఏమిటో మేము చేసే పనికి జీతాలు,సన్మానాలు,సత్కారాలు మేం కోరుకోవటం లేదు.మా పనిని గుర్తించక పోయినా పర్లేదు,కాని తక్కువ చేసి మాత్రం చూడొద్దు.

గుర్తుంచుకోండి:

ఒక గృహిణి ఇంటి పని నుంచి పార్లమెంట్ మెంబర్ వరకు ఏ పనైనా చేయగలదు కానీ ఒక గృహిణి పని ఎవరు చేయలేరు.

పోలియోతో రెండు కాళ్లు పడిపోయినా రోజుకు 16 గంటల పని.. వైతీశ్వరన్ సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు