భువనగిరి పార్లమెంట్ స్థానంలో సిపిఎం అభ్యర్థిగా బరిలో ఉన్న ఎండి జహంగీర్( MD Jahangir ) గెలుపును కాంక్షిస్తూ సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాక గ్రామానికి చెందిన సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు దొంతగోని పెద్దులు పదివేల రూపాయలు విరాళంగా అందజేశారు.మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా( Yadadri Bhuvanagiri ) చౌటుప్పల్ పట్టణంలో జరిగిన మునుగోడు నియోజకవర్గ విస్తృత సమావేశంలో సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డికి విరాళాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ అభ్యర్ధి గెలుపు కోసం ప్రతీ ఒక్క కార్యకర్త కట్టుబడి ఉండాలని కోరారు.







