ఎమర్జింగ్ ఉమెన్స్ ఆసియా కప్( Womens Emerging Asia Cup ) టోర్నీలో భారత్-హాంకాంగ్ మధ్య జరిగిన మ్యాచ్ లో భారత్ ఘనవిజయం సాధించింది.భారత మహిళల జట్టు( India Womens Team ) బౌలర్ల ధాటికి హాంకాంగ్ మహిళల జట్టు 14 ఓవర్లలో 34 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది.
భారత జట్టు బౌలర్ శ్రేయాంక పాటిల్ 3 ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం రెండు పరుగులు ఇచ్చి ఏకంగా ఐదు వికెట్లు తీసి హాంకాంగ్( HongKong ) బ్యాటర్లను మట్టికరిపించింది.ఇక మిగిలిన భారత జట్టు బౌలర్లైన పార్సవీ చోప్రా, మన్నత్ కశ్యప్ లు చెరో రెండు వికెట్లు తీశారు.
టిటాస్ సాధు ఒక వికెట్ తీసింది.

హాంకాంగ్ బ్యాటర్లలో ఒక్క మరికో హిల్ మాత్రమే 14 పరుగులు చేసి టాప్ లో నిలిచింది.మిగిలిన బ్యాటర్లంతా సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు.ఏకంగా నలుగురు బ్యాటర్లు డకౌట్ అయ్యారు.స్వల్ప లక్ష్య చేదనకు దిగిన భారత్ కేవలం ఒక్క వికెట్ నష్టానికి 5.2 ఓవర్లలో లక్ష్యాన్ని చేదించింది.భారత మహిళల జట్టు కెప్టెన్ శ్వేత సెహ్రవత్ రెండు పరుగులకే అవుట్ అయింది.గొంగోడి త్రిష 19 నాట్ అవుట్, ఉమా చెత్రి 16 నాట్ అవుట్ గా నిలిచి భారత్ ను గెలిపించారు.
ప్రస్తుతం భారత్ ఈ ఘన విజయంతో టేబుల్ టాపర్గా నిలిచింది.

ఇక ఈ టోర్నీకి సంబంధించి హాంకాంగ్ వేదికగా ఎసీసీ ఎమర్జింగ్ ఉమెన్స్ ఆసియా కప్ 2023 జరుగుతోంది.ఈ టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి.మొత్తం రెండు గ్రూపులుగా ఒక్కో గ్రూపులో నాలుగు జట్లు ఉంటాయి.
గ్రూప్-ఎ లో భారత్, హాంకాంగ్, పాకిస్తాన్, థాయిలాండ్ జట్లు ఉన్నాయి.గ్రూప్-బి లో మలేషియా, శ్రీలంక, బంగ్లాదేశ్, యూఏఈ జట్లు ఉన్నాయి.
ఇక భారత్ విషయానికి వస్తే జూన్ 15న థాయిలాండ్ తో తలపడనుంది.జూన్ 17న దాయాది అయిన పాకిస్తాన్ తో తల పడనుంది.