మహిళా ఓటర్లే లక్ష్యంగా .. కొత్త స్కీం లతో కాంగ్రెస్ 

త్వరలో జరగబోతున్నలోక్ సభ ఎన్నికల్లో( Lok Sabha elections) తెలంగాణలోని 17 నియోజకవర్గాలకు గాను, కనీసం 12 స్థానాల్లోనైనా కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించే విధంగా లక్ష్యాన్ని కాంగ్రెస్ పెట్టుకుంది.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు జనాలు మద్దతు ఇవ్వడంతో అధికారంలోకి వచ్చింది.

ఇప్పుడు అదే విధంగా జనాలను ఆకట్టుకునే విధంగా సరికొత్త రీతిలో ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు కాంగ్రెస్ సిద్ధం అవుతుంది.తెలంగాణ ఉన్న ఓటర్లలో ఎక్కువగా మహిళలు ఉండడంతో, వారి ఓటు బ్యాంకు పైనే ప్రధానంగా దృష్టి సారించింది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో మహిళలకు వర్తించే పథకాలను విస్తృతంగా ప్రచారం చేసేందుకు నిర్ణయించుకుంది.ఆర్టీసీ బస్సుల్లో రాష్ట్రమంతటా వారికి ఉచిత ప్రయాణం, 500 కే వంట గ్యాస్ సిలిండర్ పంపిణీ, మహిళా స్వయం సహాయక బృందాలకు ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల యూనిఫామ్ కుట్టేలా ఉపాధి కల్పన, ప్రభుత్వం వడ్డీ లేని రుణాలను అందించడం వంటివన్నీ ఇంటింటికి చేరేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుంది.

కాంగ్రెస్ అనుబంధ సంఘాల కార్యకర్తలు ఇప్పటికే గ్రామాల్లో విడివిడిగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.మహాలక్ష్మి( Mahalakshmi Scheme) లోని స్కీముల అమలుతో వారి ఓటు బ్యాంకుకు అనుకూలంగా మారుతుందని కాంగ్రెస్ అంచనా వేస్తోంది.రేవంత్ రెడ్డి సైతం ఇటీవల ప్రకటించిన 6 గ్యారంటీలలోని ఈ స్కీములపై ఎక్కువగా ఫోకస్ పెట్టారు.

Advertisement

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయా ణం అమలు చేశామనే విషయాన్ని హైలెట్ చేసుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది .ఇటీవలే పెరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన సభలో మహిళలకు తొలి వరుసలోనే చోటు కల్పించడంతో పాటు, అన్ని జిల్లాల నుంచి దాదాపు లక్ష మంది స్వయం సహాయక బృందాలలోని సభ్యులు హాజరయ్యే విధంగా చొరవ తీసుకున్నారు.మహిళలకు చేరువ అయ్యేవిధంగా ఆవేదికగానే వడ్డీ లేని రుణాలను అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) హామీ ఇచ్చారు.

అలాగే ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు యూనిఫాం లు కుట్టించే పనులకు కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకే అప్పగించేలా నిర్ణయం తీసుకున్నారు.దీంతోపాటు ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సౌకర్యాల కల్పనలోనూ మహిళలకు బాధ్యతలను అప్పగించేలా అమ్మ ఆదర్శ పాఠశాల పేరుతో కొత్త విధానానికి శ్రీకారం చుట్టారు.కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసిన పథకాలను జనాల్లోకి తీసుకెళ్లడంతో పాటు, మరిన్ని అదనపు పథకాలను అమలు చేయబోతున్నామనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్ళేందుకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు క్షేత్రస్థాయిలో గట్టిగానే కష్టపడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు