ఏలూరు: పురందేశ్వరీ బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పిసి కామెంట్స్.సెప్టంబర్ 17 ప్రదాని జన్మదినం ఆక్టోబర్ 2 గాంధీ జయంతి పక్షరోజులు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.
బీజేపీ సేవలను విశ్వసిస్తుంది.సేవలను చేస్తుంది.
బీసీ కులానికి చెందిన పీయం మోదీ, వారి కష్టాలను తీర్చడానికి విశ్వకర్మ యోజన పథకం తీసుకువచ్చారు.రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ హాస్పిటల్స్ కు బిల్లులు కట్టకపోవడంతో.
సేవలు ఆపేస్తామని డాక్టర్లు చెప్పారు.రాష్ట్రంలో ఆయుష్మాన్ భవ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిలేదు.ఆయుష్మాన్ భవ ఆరోగ్య కార్డులను నేరుగా లబ్ధిదారులకు అందజేస్తున్నాం.
33శాతం మహిళా రిజర్వేషన్ల బిల్లు చారిత్రాత్మకమైనది.ఆ బిల్లు 2027నుంచి అమలులోకి వస్తుంది.ఆ బిల్లు మాదేనని సోనియా గాంధీ అన్నారు.
అది వాస్తవమే.కానీ ఆ బిల్లు పాస్ చేయించే నిబద్ధత కాంగ్రెస్ కు లేదు.
పొత్తులు రెండు మూడు నెలల ముందు నిర్ణయిస్తాం.సమయానుకులంగా నిర్ణయం తీసుకుంటాం.
మద్యం నిధులు, నాసిరకం మద్యంపై కేంద్రానికి లేఖ రాస్తాను.అలాగే హోం మంత్రికి లేఖ రాస్తాం.
సంస్థాగతంగా బీజేపీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది.అన్యమతస్థులను హిందూ దేవాలయ బోర్డుల్లో నియమించకూడదని బీజేపీ భావిస్తోంది.
జనసేనతో పొత్తులోనే ఉన్నాం.టీడీపీతో ఎందుకు పొత్తు పెట్టుకోవాల్సి వచ్చిందో పవన్ చెప్పారు.ఆయన నిర్ణయంపై మా పార్టీ పెద్దలు నిర్ణయం తీసుకుంటారు.చంద్రబాబుపై కేసు వేసింది మేము కాదు.
సీ ఐడీ కేసు వేసింది.సీ ఐడీ ఎవరి చేతుల్లో ఉంటుంది.
రాష్ట్రంలో ఏమి జరిగినా బీజేపీ చేస్తుందనే అపవాదు వేస్తున్నారు.అది సరికాదు.
కక్షపూరిత రాజకీయాలను బీజేపీ సమర్ధించదు.పోలవరం ప్రాజెక్టుకు నిధులు కేంద్రమే ఇస్తుంది.
విడుదల చేసిన నిధులను రాష్ట్రం సక్రమంగా ఖర్చు చేయడం లేదు.పోలవరం నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం.