ఆ హీరో తో ప్రేమలో పడిన రజినీకాంత్ కూతురు ఐశ్వర్య..? అందుకే ధనుష్ తో అలా జరిగిందా!

ప్రస్తుతం సౌత్ ఇండియా లో యూత్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని ఎంజాయ్ చేస్తున్న హీరోల లిస్ట్ తీస్తే అందులో ధనుష్( Dhanush ) పేరు ముందు వరుసలో ఉంటుంది.ఇతను పేరుకి మాత్రమే తమిళ హీరో, కానీ వాస్తవానికి తెలుగు, హిందీ మరియు కన్నడ భాషల్లో సినిమాలు చేసి అన్నిట్లో భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందుకొని పర్ఫెక్ట్ పాన్ ఇండియన్ స్టార్ గా ఎదిగాడు.

 Rajinikanth's Daughter Aishwarya Who Fell In Love With That Hero That's Why It H-TeluguStop.com

రీసెంట్ గానే ఈయన హాలీవుడ్ లో కూడా అడుగుపెట్టిన సంగతి మన అందరికీ తెలిసిందే.అలాగే కుర్ర హీరోలలో నేషనల్ అవార్డ్స్( National Awards ) ని అందుకున్న అతి తక్కువ మందిలో ఒకరు ధనుష్.

నటన పరంగా, ఎంచుకునే సినిమాల పరంగా ధనుష్ కి వంకలు పెట్టేవాళ్ళు లేరు.కానీ వ్యక్తిగతంగా మాత్రం ఎన్నో కాంట్రవర్సిలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచాడు ధనుష్.

హీరోయిన్స్ తో ఈయన నడిపిన ట్రాక్స్ చాలానే ఉన్నాయని కోలీవుడ్ లో ఎప్పటి నుండో సాగే ప్రచారం.

Telugu Aishwarya, Dhanush, Kollywood, Rajinikanth, Simbu, Suchi Leaks-Movie

ముఖ్యంగా అప్పట్లో సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టించిన ‘సుచి లీక్స్’ ( Suchi Leaks )లో అత్యధిక ఫోటోలు మరియు వీడియోలు ధనుష్ వే వచ్చాయి.ఇదంతా పక్కన పెడితే ఈయన సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు ఐశ్వర్య ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.వీళ్ళ పెళ్లి జరిగింది రెండు దశాబ్దాలు అయ్యింది.

ఈ దంపతులిద్దరికీ ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు, ఇంతటి సుదీర్ఘ దాంపత్య జీవితం గడిపిన తర్వాత వీళ్ళ మధ్య ఏర్పడిన కొన్ని విభేదాల కారణంగా రీసెంట్ గానే విడిపోవాల్సి వచ్చింది.ఎందుకు విడిపోయారు ఏమిటి అనేది కాసేపు పక్కన పెడితే, రజినీకాంత్ కూతురు ఐశ్వర్య గురించి ఎవరికీ తెలియని ఒక ఆసక్తికరమైన విషయం ఒకటి బయటపడింది.

చాలా ఏళ్ళ తర్వాత బయటపడిన ఈ నిజం ఇప్పుడు సోషల్ మీడియా ని ఒక రేంజ్ లో ఒప్పేస్తుంది.అదేంటో ఒకసారి చూద్దాం.

Telugu Aishwarya, Dhanush, Kollywood, Rajinikanth, Simbu, Suchi Leaks-Movie

అదేమిటంటే అప్పట్లో ఐశ్వర్య ప్రముఖ కోలీవుడ్ యంగ్ హీరో శింబు తో ప్రేమాయణం నడిపింది అట.వీళ్లిద్దరి మధ్య విబేధాలు రావడం, ఆ తర్వాత వీళ్ళ లవ్ బ్రేకప్ అవ్వడం తో అతని మీద కోపంతోనే ధనుష్ ని ఈమె పెళ్లాడినట్టు తెలుస్తుంది.ధనుష్ కి శింబు( Simbu ) కి కోలీవుడ్ లో మొదటి నుండి పడదు.ఎదో ఒక విషయం ఇద్దరు గొడవలు పడుతూనే ఉంటారు.ఆ గొడవలకు మూల కారణం ఇదేనని సమాచారం.అయితే ఐశ్వర్య తో విడాకులు తీసుకున్న తర్వాత ధనుష్ ఒక ప్రముఖ కోలీవుడ్ హీరోయిన్ తో డేటింగ్ చేస్తున్నాడని, ప్రస్తుతం ఆమె ధనుష్ ఇంట్లోనే ఉంటుంది అని అంటున్నారు, ఇందులో ఎంత మాత్రం నిజం ఉందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube