టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శ్రీమతి వంగలపూడి అనిత ప్రెస్ రిలీజ్ పాయింట్లు.మాట్లాడితే అక్కాచెల్లెమ్మలు అని చెబుతూ మహిళలను ఓటుబ్యాంకుగా జగన్ రెడ్డి వాడుకుంటున్నారు.
జగన్ రెడ్డి పాదయాత్ర సమయంలోనూ, సీఎం అయిన దగ్గర్నుండి మేం గమనిస్తున్నాం.మహిళల ఓట్లు దండుకునే విధంగానే ఆయన మాటతీరును అర్థం చేసుకోవచ్చు.
జగన్ రెడ్డి నాటి నుండి నేటికీ మహిళల సంరక్షణ కోసం ఎటువంటి చర్యలూ తీసుకోలేదంటే అతిశయోక్తి కాదు.జగన్ రెడ్డి వెనుక ఉన్న భజన బృందం అంతా అక్కచెల్లెమ్మలకు చాలా న్యాయం చేస్తున్నారని, అమ్మఒడి, ఆసరా, చేయూత ఇస్తున్నారని చెబుతూ చేస్తున్నది అరకొర సహాయమే.
రాష్ట్రంలో వైసీపీ పాలనలో మహిళలకు పూర్తిగా భద్రత కరువైంది.పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో హోంశాఖ సహాయమంత్రులు నిత్యానందరాయ్, అజయ్ మిశ్రాలు ఏపీకి చెందిన సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.2019-2021 వరకు 22,278 మహిళల మిస్సింగ్ కేసులు ఉన్నాయని రాతపూర్వక సమాధానాన్ని ఏపీకి చెందిన పార్లమెంటు సభ్యులకు ఇచ్చారు.దీన్నిబట్టి చూస్తే రాష్ట్రంలో మహిళల భద్రత ఎంత అభద్రతలోకి నెట్టబడిందో కేంద్ర సహాయమంత్రులు ఇచ్చిన సమాధానాలే రుజువుచేస్తున్నాయి.
వైసీపీ ఎంపీలకు ఏమాత్రం సిగ్గు అనిపించలేదా? వాళ్లు ఎందుకు నోరెత్తలేకపోతున్నారు? చిన్నపిల్లల మిస్సింగ్ కేసులు కూడా ఉన్నాయని కేంద్రం స్పష్టం చేసినా, రాష్ట్ర ప్రభుత్వం ఇంత వరకు స్పందించలేదు.కేంద్రం సమాధానం ఇచ్చి 4రోజులైనా ముఖ్యమంత్రికి, మంత్రులకు మహిళల భద్రతపై చీమకుట్టినట్లు కూడా లేదు.
మహిళలు జగన్ రెడ్డిని అన్నయ్య, తమ్ముడు అని భావించి ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టినందుకు జగన్ రెడ్డి ఇచ్చే బహుమతి ఇదేనా? రాష్ట్రంలో డెకాయిట్ కేసులు 85శాతం పెరిగాయి.నేరాలు, ఘోరాల్లో దక్షిణ భారతదేశంలో ఏపీ నెంబర్ వన్ స్థానంలో ఉంది.
పరిశ్రమలు, ఉద్యోగ అవకాశాలు, రైతులకు ఇచ్చే రాయితీల్లో మొదటి స్థానంలో ఉంటే మేం కూడా హర్షించేవాళ్లం.కానీ మహిళలపై అఘాయిత్యాలు, మిస్సింగ్ కేసుల్లో ఏపీ ముందు ఉన్నాయంటే సిగ్గుచేటు అనిపిస్తోంది.
దీనికి కూడా వైసీపీ నాయకులు భుజాలు చరుచుకునే పేటీఎం కుక్కలున్నంతకాలం మహిళల భద్రత ఇంతే.ఏపీని గంజాయి ఆంధ్రప్రదేశ్ గా జగన్ రెడ్డి మార్చేశారు.డ్రగ్స్, గంజాయి సరఫరాలో ఏపీ మొదటి స్థానంలో ఉంది.
మహిళల జీవితాలు, యువత భవిష్యత్తు, చిన్నారుల భవిష్యత్తు ఏమైనా జగన్ రెడ్డికి, తన గ్యాంగ్ కు పట్టడం లేదు.కేవలం తమ జేబులు నింపుకోవడమే పరమావధిగా అక్రమాలకు పాల్పడుతున్నారు.వైసీపీ వికృత చేష్టలు చూసి ఎప్పుడు ఎన్నికలు వస్తాయి? చంద్రబాబును సీఎం కుర్చీలో ఎప్పుడు కూర్చోబెట్టాలని మహిళలు చూస్తున్నారు.జగన్ రెడ్డి చర్యల పట్ల మహిళల తరపున బాధగా ఉంది.
వైసీపీ ఎంపీలు 28మంది నేటికీ ట్వీట్లు పెట్టడం తప్ప, మహిళల రక్షణ, దిశా చట్టంపై పార్లమెంటులో ఎందుకు నోరు మెదపలేకపోతున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలి.దిశా చట్టానికి చట్టబద్దత కల్పించాలని ఎందుకు కేంద్రాన్ని అడగలేకపోతున్నారు?ఒక మహిళ ఏపీ హోంశాఖ మంత్రిగా ఉండి కూడా మహిళలకు రక్షణ లేకుండా పోతే ఎలా? దీనికి కూడా సజ్జల, జగన్ స్క్రిప్టు కావాల్సిందేనా? మహిళల మిస్సింగులపై హోంశాఖపై రివ్యూ కూడా చేయలేకపోతున్నారా? మన ఇంటి ఆడపిల్లలకు ఇదే పరిస్థితి నెలకొంటే ఇలాగే చేస్తారా హోం మంత్రి? ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి.మహిళా కమిషన్ చైర్ పర్సన్ కేంద్ర సమాధానాన్ని ఆధారంగా చేసుకుని డీజీపీ దగ్గరకు వెళ్లి మహిళల మిస్సింగులపై నివేదిక కోరాలి.
పరిస్థితులపై రివ్యూ చేయాలి.ఎవరో భారతీరెడ్డినో, నన్నో ఏదో అన్నారని పరిగెత్తడం మానేసి రాష్ట్ర మహిళలు ఎందుకు మాయమవుతున్నారనే విషయంపై మీకున్న సర్వాధికారాలు ఉపయోగించి తగు చర్యలు చేపట్టాలి.ఏపీ మహిళా కమిషన్ ‘‘జగన్ రెడ్డి కమిషన్’’ అనే విషయం మాకు తెలుసు.
మహిళలు మిస్సింగ్ లు కలకలం రేపుతుంటే.ఒక మంత్రి జగన్ స్వర్ణోత్సవాలు అంటూ స్టేజిలపై గంతులేయడం, మహిళా కమిషన్ చైర్ పర్సన్ కేవలం భారతీరెడ్డి ఒక్కరే ఈ రాష్ట్రంలో మహిళ అనే విధంగా స్పదించడం బాధాకరం.
మరో వ్యక్తి జై జగనన్న జై జగనన్న అంటూ భజన చేయడం, చిడతలు మోగించడం దౌర్భాగ్యం.వైసీపీ నుండి కనీసం ఇంగిత జ్ఞానం లేనివాళ్లు అసెంబ్లీలో, పార్లమెంటులో కూర్చోవడం రాష్ట్ర మహిళలు చేసుకున్న దౌర్భాగ్యం.
జగన్ రెడ్డి కనీసం ఇప్పటికైనా మహిళల రక్షణపై దృష్టిపెట్టి, మహిళ సంరక్షణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.రానున్న కాలంలో చంద్రబాబు పాలనలో మహిళల రక్షణకు పెద్దపీఠ వేస్తామని రాష్ట్రంలోని మహిళలకు తెలియజేస్తున్నాం.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy