వైద్యం పేరుతో వ్యభిచారం నడుపుతున్న మహిళా డాక్టర్.... చివరికి... 

ప్రస్తుత కాలంలో అవసరంలో ఉన్న వారిని ఆదుకోవాల్సింది పోయి కొందరు వాళ్లని అవకాశంగా తీసుకొని వారితో చేయరాని తప్పులు చేయిస్తున్నారు.

తాజాగా ఓ మహిళ వైద్యురాలు రోగాలతోతన వద్దకు వచ్చిన మహిళలతోనే వ్యభిచారం చేయిస్తున్న ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కలకలం రేపింది.

వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రంలోని గాయత్రి సింగ్ అనే యువతి ఈ మధ్యనే మెడిసన్ చేసి ప్రాక్టీస్ మొదలు పెట్టింది.ఇందులో భాగంగా భూపాల్ నగరంలోని ఓ ప్రాంతంలో చిన్నపాటి క్లినిక్ ని తెరిచి వైద్యం చేయడం మొదలుపెట్టారు.

అయితే అడ్డదారుల్లో డబ్బు సంపాదించాలనే కోరికతో వ్యభిచారాన్ని మార్గంగా ఎంచుకుంది.ఇందులో భాగంగా తన వద్దకు వైద్యం కోసం వచ్చేటువంటి మహిళలను టార్గెట్ చేస్తూ వ్యభిచార కూపంలోకి దింపుతూ డబ్బు సంపాదించడం మొదలు పెట్టింది.

అయితే ఈ విషయంపై అనుమానం వచ్చినటు వంటి కొందరు స్థానికులు పోలీసులకు సమాచారాన్ని చేరవేశారు.దీంతో నిజానిజాలేంటో తెలుసుకోవడానికి పోలీసులు పథకం పన్నారు.పథకంలో భాగంగా ముందుగా వైద్యురాలు గాయత్రి సింగ్ వద్దకు ఓ లేడీ కానిస్టేబుల్ ని పంపించి ఉద్యోగం కావాలని అడగగా ఆమె వ్యభిచారం చేయాలని సూచించింది.

Advertisement

అంతేగాక దీనివల్ల ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చని తన వద్ద విటులు ఉన్నారని ప్రేరేపించింది.దీంతో వారు అందుకున్నటువంటి సమాచారం నిజమేనని తేలడంతో వెంటనే వైద్యురాలు గాయత్రి సింగ్ ని పోలీసులు అరెస్టు చేశారు.

  .

Advertisement

తాజా వార్తలు