Viral Video : సెల్ ఫోన్ చూస్తూ అపరిచితుడి బైక్ ఎక్కిన మహిళ.. వీడియో చూస్తే నవ్వే నవ్వు..

ఈరోజుల్లో చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు మొబైల్ ఫోన్లను( Mobile Phones ) తెగ వాడేస్తున్నారు.ఈ మొబైల్ వాడకం ఎంత పెద్ద వ్యసనంలా మారిందంటే వారు వారి చుట్టూ ఏమి జరుగుతుందో అసలు పట్టించుకోవడం లేదు.

 Woman Mistakenly Gets On Stranger Motorbike Instead Of Her Bf After Getting Dis-TeluguStop.com

దీని కారణంగా ఒక్కోసారి వారు ప్రమాదాల్లో పడుతున్నారు.మరికొన్నిసార్లు పొరపాట్లు చేస్తున్నారు.

ఈ పొరపాట్లలో కొన్ని షాకింగ్గా అనిపిస్తే, మరికొన్ని హిలేరియస్ గా అనిపిస్తున్నాయి.తాజాగా ఒక యువతి తన భాగస్వామి స్కూటీపై పెట్రోల్ స్టేషన్ కు వచ్చింది.

పెట్రోల్( Petrol ) కొట్టించుకునే సమయంలో కిందకి దిగింది.ఆపై ఫోన్ వాడటం మొదలుపెట్టింది.

ఆ ఫోన్ వాడుతూ ఆమె అపరిచితుడు స్కూటర్ ఎక్కేసింది.ఈ ఫన్నీ ఘటనకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో వైరల్ గా మారింది.

ఈ వీడియో ఇండోనేషియా నుండి వచ్చింది.ఇందులో పెట్రోల్ స్టేషన్లో ఏమి జరిగిందో చూపిస్తుంది.

Telugu Stranger Bike-Latest News - Telugu

ఆ మహిళ తన భాగస్వామి మోటార్సైకిల్పై నుంచి దిగి తన ఫోన్ని చూస్తూనే వెళ్లిపోయింది.ఆమెకి ఎదురుగా వేరే వారి మోటార్ సైకిల్ ఉన్నట్టు చూడలేదు.తన పార్టనర్ మోటార్ సైకిల్( Motor Cycle ) అనుకుని దాని మీద కూర్చుంది.దాంతో ఆమె పార్టనర్ షాక్ అయ్యాడు.కొంపమునగ ముందుకే అతడు వచ్చి ఆమె భుజాన్ని తాకాడు.అప్పటిదాకా అది తన భాగస్వామి మోటార్సైకిల్ కాదని ఆమె గమనించలేదు.

ఆమె చాలా ఆశ్చర్యపోయి,సిగ్గుపడింది.ఆపై సరైన మోటార్సైకిల్పై ఎక్కి కూర్చుంది.

ఆమె తనలో తాను నవ్వుకుంది, వీడియో అక్కడితో ముగిసింది.ఈ వీడియోకు ఐదు లక్షల దాకా వ్యూస్ వచ్చాయి.

మలేషియాకు చెందిన పలువురు ఈ వీడియోపై కామెంట్లు చేశారు.అపరిచితుడి మోటారుసైకిల్పై ఆమె వెళ్లి ఉంటే పరిస్థితి ఏమై ఉండేదని నెటిజన్లు కామెంట్లు చేశారు.

Telugu Stranger Bike-Latest News - Telugu

ఆ మహిళ అదృష్టమని ఓ వ్యక్తి మలయ్లో చెప్పాడు.తన చిన్నప్పుడు ఇలా జరిగిందని, పొరపాటున తప్పుగా మోటర్సైకిల్ ఎక్కానని మరో వ్యక్తి చెప్పాడు.అయితే కొంతమందికి ఈ వీడియో నచ్చకపోవడంతో అది ఫేక్ అని భావించారు.కారణం లేకుండానే కెమెరాలో రికార్డింగ్ జరుగుతోందని, మహిళ, అపరిచితుడు కలిసి ఇలా ప్లాన్ చేశారని వారు తెలిపారు.

వీడియో ఫన్నీగా( Funny Video ) ఉంది, కానీ ఇది తీవ్రమైన సమస్యను కూడా చూపించింది.మొబైల్ ఫోన్లను ఎక్కువగా ఉపయోగించడం వల్ల మన పరిసరాలను మరచిపోతామని అందులో చూపించారు.

మనం మన ఫోన్లను ఉపయోగించేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలని ఇది గుర్తు చేసింది.ఒక్కోసారి మనల్ని మనం చూసి సరదాగా నవ్వుకోవచ్చు అని కూడా చూపించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube