అగ్నిపర్వతంపై పిజ్జా వండడం ఏమిటి? అమ్మ కడుపు మాడ! అని అనుకుంటున్నారు కదూ.నిజమే, ఆ అమ్మాయి కడుపు మాడే అగ్నిపర్వతంపై పిజ్జా( Pizza ) వండుకుంది.
ఆ తరువాత దానిని లొట్టలేసుకు తింటూ రుచి అమోఘం అంటూ నోరూరించింది మరి.పూర్తి వివరాలు తెలియాలంటే ఈ పూర్తి కధనంలోకి వెళ్ళండి మరి.మనలో చాలామంది విహార యాత్రలు చేయడానికి చాలా మక్కువ చూపుతారు.ఈ క్రమంలో చిత్ర విచిత్రమైన ప్రదేశాలు వెళ్లి వస్తుంటారు.
అదే విధంగా “అలెగ్జాండ్రా బ్లాడ్జెట్”( Alexandra Blodgett ) అనే మహిళకు అగ్ని పర్వతం( Volcano ) మీద పిజ్జా వండుకుని తినాలనిపించింది.ఇదేం పిచ్చి కోరిక అనుకోకండి.
అలెగ్జాండ్రా బ్లాడ్జెట్ ఓ ప్రకృతి ప్రేమికురాలు మరియు పర్యాటకురాలు.

ఆమె అలా గ్వాటెమాలలో( Guatemala ) యాక్టివ్‌గా ఉన్న అగ్ని పర్వతంపై పిజ్జా వండుకుని తింది.అక్కడితో ఆగకుండా ఆమె తిన్న వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ అవుతోంది.తన సోషల్ మీడియా ఖాతాలో ఆమె స్వయంగా ఈ వీడియోను పోస్ట్ చేయడంతో చాలామందిని ఆ వీడియో ఆకర్శించింది.
ఆమె సదరు వీడియోని షేర్ చేస్తూ… ‘యాక్టివ్‌గా ఉన్న అగ్ని పర్వతంపై పిజ్జా వండుకుని తినడానికి గ్వాటెమాలకు వెళ్తున్నాను.అంతే కాకుండా అక్కడి ఆహ్లాదకరమైన ప్రదేశాలు ఎంజాయ్ చేయాలనే కోరిక నాకు ఎప్పటినుండో వుంది.2021లో బద్దలైన ఇక్కడి అగ్ని పర్వతం యాక్టివ్‍గానే ఉంది.ఈ నేషనల్ పార్క్ లోనికి వెళ్లాలంటే తప్పనిసరిగా గైడ్ ఉండాలి.
లేదంటే అంత ఈజీకాదు.మేము పిజ్జా తయారు చేయడం కోసం ముందుగానే బుక్ చేసుకున్నాము.
అక్కడ చలిగా ఉంటుంది.గాలులు వీస్తాయి’ అనే క్యాప్షన్‌తో అలెగ్జాండ్రా బ్లాడ్జెట్ తన పోస్టును షేర్ చేసింది.

ఇక్కడ వీడియోని ఒక్కసారి గమనిస్తే, వీడియోలో ఒక వ్యక్తి కూరగాయలతో వండని పిజ్జాను ట్రేలో ఉంచి అక్కడి నేలపై పెట్టడం మనం గమనించవచ్చు.ఆ తరువాత దానిని తీసి ఆమెకి అందించాడు.ఇక అలెగ్జాండ్రా దానిని తింటున్నట్లు వీడియోలో మనకు స్పష్టంగా కనిపిస్తుంది.ఈ పోస్ట్ వైరల్ కావడంతో అనేకమంది నెటిజన్లు దీనిపై స్పందిస్తున్నారు.మేడం మీరు సూపర్.మీ ప్రొఫెషన్ చాలా బెటర్ మా జీవితాలకంటే! అని కొందరు కామెంట్ చేస్తే….
అగ్నిపర్వతంపై పిజ్జా వండాలనే రొమాంటిక్ థాట్ మీకు ఎలా వచ్చింది మేడం? అంటూ మరికొంతమంది ఆమెని ప్రశ్నిస్తున్నారు.







