పొద్దున్నే ఆఫీస్‌కు వెళ్లాల్సి ఉంటుంది.హడావుడిగా పనిచేసుకునే సమయం.తీరా అప్పుడే అయిపోతుంది.గ్యాస్ సిలిండర్.అవును పైగా ఇది శ్రావణమాసం పూజలు పండుగలు నిర్వహించుకుంటాం.గ్యాస్ సిలిండర్ బుక్ చేసినా.
డెలివరీ పండగ సమయాల్లో నాలుగైదు రోజులైనా టైం తీసుకుంటుంది.ఇలా చాలా మందికి జరుగుతుంది.
గ్యాస్ అయిపోయిన తర్వాత హడావుడిగా గ్యాస్ బుక్ చేసుకుంటారు.మామూలుగా గ్యాస్ ఎప్పుడు అయిపోతుందో చెప్పడం కూడా కష్టం.
కానీ, ఒక ట్రిక్‌ను ఉపయోగించి సిలిండర్‌లో గ్యాస్ ఎంత మేర ఉందో తెలిసిపోతుంది.అదేంటో తెలుసుకుందాం.
సాధారణంగా కొంత మంది సిలిండర్‌లో గ్యాస్ ఎంత మిగిలి ఉందో అంచనా వేస్తారు.అంటే దాని బరువును చెక్ చేసి లేదా గ్యా స్ మంట నీలి, పసుపు రంగులో మండుతుంటే గ్యాస్ అయిపోవడానికి దగ్గర పడిందని అంటారు.
కానీ, అది సరైన ఫలితం కాదు.కేవలం అంచనా మాత్రమే! చాలా తక్కువ మందికి అనుకున్న సమయానికి గ్యాస్ అయిపోతుంది.బర్నర్‌లో ఏదైనా సమస్య ఏర్పడినా ఇలా మంట రంగు మారుతుంది.అయితే, ఇప్పుడు తెలుసుకోబోయే ట్రిక్‌తో మీకు కచ్ఛితంగా నూరు శాతం ఫలితం ఉంటుంది.
మీ ఎల్‌పీజీ సిలిండర్‌లో ఇంకా ఎంత గ్యాస్ ఉందో తెలుసుకోవచ్చు.దీనికి తడి చేసిన గు డ్ట అవసరం.

గ్యాస్ సిలిండర్‌కు తడి గుడ్డను చుట్టాలి.సుమారు ఒక నిమిషం తర్వాత ఆ వస్త్రాన్ని పూర్తిగా తీసివేయాలి.అప్పుడు వెంటనే మీ సిలిండర్‌పై వచ్చిన మార్పును గమనించవచ్చు.సిలిండర్ కొంత భాగం పొడిగా ఉంటుంది.
మరి కొంత భాగం తడిగా ఉంటుంది.అది స్పష్టంగా కనిపిస్తుంది.
సిలిండర్‌లో ఖాళీగా ఉన్న ప్రదేశం వేడి వల్ల త్వరగా గుడ్డలోని నీరును పీల్చుకుంటుంది.దీంతో అది డ్రై అయిపోతుంది.
గ్యాస్ ఉన్న ప్రాంతం అంతా నీరు ఆరిపోవడానికి సమయం పడుతుంది.ఇలా మీ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్‌లో గ్యాస్ ఎప్పుడు అయిపోతుందో తెలుసుకోవచ్చు.