ఈ ఎడ్యుకేషన్ యాప్స్‌తో మీ ఫోన్‌ను నాలెడ్జ్ హబ్‌గా మార్చుకోవచ్చు..

మీరు కొత్త స్కిల్స్ నేర్చుకోవడానికి మీ ఐఫోన్ లేదా ఐప్యాడ్‌ని ఉపయోగించాలనుకుంటే, మీకోసం అనేక ఎడ్యుకేషనల్ యాప్‌లు అందుబాటులో ఉన్నాయి.ఈ యాప్‌లు మీకు లాంగ్వేజ్ లెర్నింగ్, కెరీర్ డెవలప్‌మెంట్, అకడమిక్ విషయాలలో సహాయపడతాయి.

 With These Education Apps You Can Turn Your Phone Into A Knowledge Hub.. Educati-TeluguStop.com

వివిధ భాషలను నేర్చుకోవడానికి డుయోలింగో ( Duolingo ) అనే ఒక యాప్ చాలా బాగా ఉపయోగపడుతుంది.ఇది మీ నైపుణ్య స్థాయికి అనుగుణంగా సరదా గేమ్‌లు, పాఠాలను ఆఫర్ చేస్తుంది.

మీరు ఇంగ్లీష్, స్పానిష్, ఫ్రెంచ్, మరిన్ని భాషలను ఈ యాప్ ద్వారా నేర్చుకోవచ్చు.

యూడెమీ ( Udemy ) అనే మరో యాప్ విభిన్న కెరీర్‌ల కోసం మీ స్కిల్స్‌ను మెరుగుపరచడానికి వీడియో కోర్సులను అందిస్తుంది.

మీరు మీ అవసరాలకు సరిపోయే కోర్సులను ఎంచుకోవచ్చు.మీరు తీసుకునే కోర్సులకు మాత్రమే డబ్బులు చెల్లిస్తే సరిపోతుంది. ఆఫ్‌లైన్‌లో చూడటానికి మీరు ట్యుటోరియల్‌లను కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Telugu Career, Duolingo, Apps, Language, Linkedin, Mathproblem, Skill, Udemy-Lat

లింక్డ్‌ఇన్ లెర్నింగ్( LinkedIn Learning ) అనేది మీ కెరీర్‌లో ముందుకు సాగడానికి మీకు సహాయపడే వేదిక.ఇది రెజ్యూమ్ రైటింగ్, ప్రోగ్రామింగ్ వంటి వాటిపై కోర్సులను అందిస్తుంది.కొన్ని కోర్సులు ఉచితం, మరికొన్నింటికి సబ్‌స్క్రిప్షన్ అవసరం.

మీరు మీ ప్రోగ్రెస్‌ను ట్రాక్ చేయవచ్చు, లింక్డ్‌ఇన్‌లో మీ విజయాలను పంచుకోవచ్చు.

Telugu Career, Duolingo, Apps, Language, Linkedin, Mathproblem, Skill, Udemy-Lat

మీకు మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ లో సహాయం కావాలంటే, PhotoMath అనే యాప్ ఉంది.ఇది మీ ఐఫోన్‌తో గణిత సమస్యలను స్కాన్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.మీకు దశల వారీ పరిష్కారాలను అందిస్తుంది.

ఇది సాధారణ గణిత సమస్యలకు ఉపయోగపడుతుంది.PhotoMath యాప్‌ మీ ఐఫోన్ లేదా ఐప్యాడ్‌లకు అందుబాటులో ఉంటుంది.

ఇక పైన పేర్కొన్న వాటిలో కొన్ని ఆండ్రాయిడ్ ఫోన్లలో కూడా పని చేస్తాయి.వీటితోపాటు కోర్సేరా, యూట్యూబ్‌( Youtube ) వంటివి కూడా నాలెడ్జిని పెంచే యాప్స్ గా ఉపయోగపడుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube