కంప్యూటర్ లేదా ల్యాప్‌ట్యాప్ వాడే ప్రతిఒక్కరికీ మౌస్ చాలా అవసరం.మౌస్ లేకుండా కంప్యూటర్‌లో ఏ పని చేయలేం.
కంప్యూటర్ వాడాలంటే తప్పనిసరిగా మౌస్ ఉండాల్సిందే.ఇక మౌస్ లేకుండా ల్యాప్‌ట్యాప్ వాడొచ్చు.
కానీ మౌస్ లేకపోతే ల్యాప్‌ట్యాప్ వాడటానికి కాస్త ఇబ్బందిగా ఉంటుంది.ల్యాప్‌ట్యాపులలో ఇన్‌బిల్ట్ మౌస్ ప్యాడ్ అందుబాటులోకి ఉంటుంది.
కానీ దానిని ఎక్కువమంది ఉపయోగించరు.ఎక్ట్సర్నల్ మౌస్‌ను ఎక్కువమంది వాడతారు.
ఇన్‌బిల్ట్ మౌస్ ప్యాడ్ అంత సౌకర్యవంతంగా ఉండదు.అదే ఎక్ట్సర్నల్ మౌస్ అయితే వాడటానికి చాలా ఈజీగా ఉంటుంది.
అయితే మౌస్‌లలో రెండు రకాలు ఉంటాయి.ఒకటి వైర్ లెస్ మౌస్, రెండోది వైర్డ్ మౌస్.ఈ రెండిటిల్లో ఏది వాడటం మంచిదనే విషయం గురించి చూస్తే… వైర్‌లెస్ మౌస్ కొంచెం నెమ్మదిగా ఉంటుంది.వైర్ లెస్ మౌస్ రియాక్షన్ వైర్డ్ మౌస్ టైం కంటే చాలా నెమ్మదిగా ఉంటుంది.
ల్యాప్‌ట్యాప్‌లలో గేమ్స్ ఆడేవారికి ఇది బాగా తెలుస్తుంది.ఒకవేళ గేమ్స్ ఆడేవారు అయితే వైర్డ్ మౌస్ వాడటం మంచిది.
ఇక వైర్‌లెస్ మౌస్ ద్వారా ఎక్కడనుంచైనా పనిచేయవచ్చు.మీ ల్యాప్‌ట్యాప్ లేదా డెస్క్‌టాప్ మౌస్ రేంజ్‌లో ఉండే ప్రాంతంలో ఎక్కడనుంచైనా ఆపరేట్ చేయవచ్చు.
అదే వైర్ ఉండే మౌస్ అయితే అలా కుదరదు.ల్యాప్‌ట్యాప్ లేదా డెస్క్‌టాప్ ముందు కూర్చోవాలి.
ఇక వైర్ లెస్ మౌస్‌కు బ్యాటరీ అవసరం.అదే వైర్డ్ మౌస్‌కి అయితే బ్యాటరీ అవసరం ఉండదు.మీరు గేమింగ్ లేదా ఎడిటింగ్ కోసం వాడుతుంటే వైర్డ్ మౌస్ తీసుకోండి.అలాగే ఇతర పనుల కోసం అయితే వైర్ లెస్ మౌస్ తీసుకోండి.ఇలా మీ అవసరాన్ని బట్టి ఏ మౌస్ ఉత్తమం అనేది మీరే నిర్ణయించుకోండి.