వికారాబాద్ జిల్లాలో జరిగిన శిరీష హత్య కేసులో మిస్టరీ వీడింది.యువతిని ఆమె బావ అనిల్ హత్య చేశాడని పోలీసులు తెలిపారు.
అక్క భర్త అనిల్ తో శిరీష వివాహేతర సంబంధం ఉందని తెలుస్తోంది.అయితే ఇంటి వద్ద శిరీషను ఫోన్ లో ఎక్కువగా మాట్లాడుతున్నావని ఆమె అన్న మందలించారు.
అదే సమయంలో ఇంటికి వచ్చిన బావ కూడా కొట్టడంతో శిరీషా తీవ్ర మనస్తాపానికి గురైందని సమాచారం.అనంతరం అర్థరాత్రి సమయంలో కలుద్దామని అనిల్ పిలిచాడని, ఆ తరువాత శిరీషాపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసినట్లు సమాచారం.
ఈ క్రమంలో పోలీసులు శిరీషా మృతదేహాన్ని రీపోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తున్నారు.







