చాలామంది వ్యోమగాములు అంతరియక్ష( Astronauts in space ) యానం చేస్తూ ఉంటారు.వ్యోమగాముల పనే కూడా అదే.
వృత్తిరీత్యా వాళ్లు అంతరిక్షంలో పర్యటిస్తూ ఉంటారు.ఒకసారి అంతరిక్షంలోకి వెళితే మళ్లీ భూమి మీదకు రావడానికి వారికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో కూడా తెలియదు.
అయినా వారికి అంతరిక్ష యానం చేయం ఇష్టం.అంతరిక్షంలోకి వెళితే తిరిగి వస్తారా? లేదా? అనేది కూడా డౌటే.అంతరిక్ష యానం అనేది అత్యంత ప్రమాదంతో కూడుకున్న పని, దీనికి ఎంతో ధైర్యం ఉండాలి.అలాగే వ్యోమగాములు ఆరోగ్యపరంగా కూడా ఎప్పుడూ మెరుగ్గా ఉండాలి.అత్యంత కష్టంతో కూడుకున్న పని ఇది.

అయితే సుదీర్ఘ అంతరిక్ష యానం చేసే వ్యోమగాములకు అనేక అనారోగ్య సమస్యలు ( Health problems )వస్తాయని ఒక రిసెర్చ్‌లో తేలింది.సుదీర్ఘ అంతరిక్ష యానం వల్ల మెదడు డ్యామేజ్ అవుతుందని, వ్యోమగాములు జాగ్రత్తగా ఉండాలని సైంటిస్టులు చెబుతున్నారు.ఈ పరిశోధనలో భాగంగా దాదాపు 30 మంది వ్యోమగాములను పరిశోధకులు పరిశీలించారు.వీరిలో 8 మంది వ్యోమగాములు రెండు వారాల పాటు అంతరిక్షంలో పర్యటించగా.18 మంది ఆరు నెలలు ఉన్నారు.మరో నలుగురు సంవత్సరం పాటు అంతరిక్షంలో ఉన్నారు.

అంతరిక్ష యాత్రకు ముందు, తర్వాత వ్యోమగాముల బ్రెయిన్‌ను స్కాన్( Scan the brain ) చేశారు.ఆరు నెలల పాటు అంతరిక్షంలో గడిపిన వ్యోమగాముల మెదడు జఠరికలు గణనీయంగా పెరిగాయని తేలింది.మెదడులో ఉండే బోలు అనే ప్రాంతంలో జఠరికలు ఉంటాయి.
అంతరిక్షంలో గురుత్వాకర్షణ లేకపోవడం వల్ల ఈ ద్రవం బలవంతంగా మెదడు పుర్రెలోకి వెళుతుంది.ఇవి బ్రెయిన్‌ను డ్యామేజ్ చేస్తాయి.
దీని నుంచి కోలుకోవడానికి మూడేళ్ల సమయం పడుతుందని చెబుతున్నారు.అంతరిక్షంలో ఎక్కవరోజులు గడిపే కొద్ది జఠరికలు పెద్దవిగా మారుతున్నట్లు సైంటిస్టులు గుర్తించారు.
ఫ్లోరిడా యూనివర్సిటీలోని అప్లైడ్ ఫిజియాలజీ అండ్ కినిషియాలజీ ప్రొఫెసర్, సైంటిస్ట్ రాచెల్ సీడ్లర్ ఈ పరిశోధన చేసినట్లు తెలుస్తోంది.







