ఏపీలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో ( assembly elections )మహిళా ఓటు కీలకంగా మారబోతున్నట్లుగా తెలుస్తుంది .ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ ప్రకారం ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల ముసాయిదా జాబితాను ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మినా( Mukesh Kumar Meena ) విడుదల చేశారు .
ఈ ఏడాది జనవరి 5 న విడుదల చేసిన జాబితా కంటే 2 లక్షల 36 వేల ఓట్లు పెరిగినట్లుగా తెలుస్తుంది.ముసాయిదా ప్రకారం రాష్ట్రంలోని మొత్తం ఓటర్లు 4 కోట్ల 2 లక్షల 21 వేల 450 మంది .ఇందులో పురుషుల ఓట్లు ఒక కోటి 98 లక్షల 31 వేల 7 వందల 91 కాగా మహిళల ఓట్లు 2 కోట్ల మూడు లక్షల 85 వేల 851 .దాంతో వచ్చే ఎన్నికలలో మహిళా ఓటు ప్రధాన శక్తిగా మారబోతున్నట్లు తెలుస్తుంది.
దాంతో రాజకీయ పార్టీలన్నీ మహిళా ఓటర్లను ఆకర్షించడానికి పోటాపోటీ హామీలను ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది.ఇప్పటికే అధికార వైసిపి( YCP ) తమ సంక్షేమ పథకాలన్నీ మహిళా కేంద్రంగానే అమలు చేస్తుంది.
కుటుంబం మొత్తం స్త్రీ నాయకత్వంలోనే నడిచే విధంగా వైసీపీ ప్రోత్సహిస్తుంది.అదే విధంగా ప్రతిపక్ష టీడీపీ( TDP ) కూడా మహిళల కేంద్రంగా అనేక హామీలను ఇప్పటికే ప్రకటించింది.
దాంతో మహిళల ఆదరణ మెజారిటీ గెలుచుకున్న పార్టీకే రాష్ట్రంలో చక్రం తిప్పే అవకాశం కనిపిస్తుంది .

తాము అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అన్నీ స్త్రీల లక్ష్యం గానే ఉన్నందున తమ పార్టీ పై మహిళలు ఆదరణ తో ఉన్నారని అధికార పార్టీ ధీమా గా ఉండగా అసలు మహిళలకు స్వయంప్రతిపత్తి తీసుకొచ్చిన డ్వాక్రా ల సృష్టికర్త చంద్రబాబు అని అందువల్ల మహిళల్లో చంద్రబాబు కి పూర్తిస్థాయి మద్దతు ఉందని తెలుగుదేశం ప్రచారం చేస్తుంది.ఏది ఏమైనా మహిళలను ఆకాశంలో సగం అంటారు.కానీ ఆంధ్రప్రదేశ్ వరకూ మాత్రం వారి సంఖ్య సగం కన్నా ఎక్కువ ఉండడంతో ఇప్పుడు మహిళా ఓటర్లను ప్రసన్న చేసుకోవడానికి రాజకీయ పార్టీలు కొత్త వ్యూహాలను పన్నుతారని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు
.