తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయనుండటంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.పోటీ చేసే అంశంపై పార్టీ అధినేత చంద్రబాబుతో తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ చర్చలు జరపనున్నారు.
ఈ మేరకు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబుతో కాసాని ములాఖత్ కానున్నారు.తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో పోటీ చేయకపోయినా, టీడీపీ బలంగా ఉన్న స్థానాల్లో బరిలోకి దిగాలని కాసాని భావిస్తున్నారు.
ఇందులో భాగంగా ఇప్పటికే సుమారు 63 మంది అభ్యర్థులతో జాబితాను సిద్ధం చేశారని తెలుస్తోంది.రాజకీయ పార్టీ పోటీకి దూరంగా ఉండకూడదని ఆయన భావిస్తున్నారని తెలుస్తోంది.
మరోవైపు పోటీ చేసే అంశంపై చంద్రబాబు నో చెబితే కాసాని పార్టీ మారే అవకాశం ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది.ఈ క్రమంలో తెలంగాణలో టీడీపీ పోటీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.







