నందమూరి చిన్నోడికి హిట్ ఇచ్చిన వశిష్ట మెగాస్టార్ కి హిట్ ఇస్తాడా..?

ప్రస్తుతం చిరంజీవి( Chiranjeevi ) చేస్తున్న విశ్వంభర సినిమాకు( Vishwambhara ) సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

ఇక ఇప్పుడు చిరంజీవి త్రిషల మీద కొన్ని రొమాంటిక్ సీన్లను కూడా చిత్రీకరిస్తున్నట్టుగా తెలుస్తోంది.

అయితే ఈ సీన్లు సినిమాకి హైలెట్ గా నిలువనున్నాయి అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.మరి ఇప్పటివరకు చిరంజీవి చేసిన అన్ని సినిమాల్లో కూడా డిఫరెంట్ పాత్రలను పోషిస్తూ వస్తున్నాడు.

ఇక ఇందులో కూడా అలాగే ఒక వైవిద్యమైన పాత్ర చేస్తున్నప్పటికీ చిరంజీవికి మధ్యలో కొన్ని ఫ్లాప్ లైతే వచ్చాయి.

మరి వాటిని ఎలాగైనా సరే అధిగమించాలనే ఉద్దేశ్యంతో ప్రస్తుతం వశిష్ట( Vasishta ) డైరెక్షన్ లో సినిమా చేస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఈ సినిమాతో తనను తాను మరొకసారి ప్రూవ్ చేసుకోగలిగితే ఆయనను మించిన నటుడు మరొకరు ఉండరు అనేది వాస్తవం.ఇక ఇప్పటికే చిరంజీవి చాలా మంచి విజయాలను అందుకున్నాడు.

Advertisement

ఆయన ఇప్పుడు కూడా అలాంటి మ్యాజిక్ నే రిపీట్ చేయాలని చూస్తున్నాడు.ఇక బాబీ డైరెక్షన్ లో వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమా మంచి విజయాన్ని సాధించింది.

దాని తర్వాత వచ్చిన భోళా శంకర్ సినిమా డిజాస్టర్ అయింది.ఇక ఆ డిజాస్టర్ నుంచి తేరుకోవడానికి ఎలాగైనా సరే ఒక పెద్ద సక్సెస్ కావాలనే ఉద్దేశ్యం తోనే వశిష్ట డైరెక్షన్ లో ఈ సినిమాను చేస్తున్నాడు.

ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.కాబట్టి ఎలాగైనా సరే ఒక భారీ బ్లాక్ బాస్టర్ ని దక్కించుకొని ఇండస్ట్రీలో తనకున్న ఇమేజ్ ని మరింత పెంచుకోవాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇంతకుముందే వశిష్ట బింబిసారా( Bimbisara ) అనే సినిమాతో ఒక మంచి విజయాన్ని అందుకున్నాడు.

మరి ఇప్పుడు ఈ సినిమాతో కూడా సూపర్ సక్సెస్ ను అందుకుంటే ఆయన కూడా స్టార్ట్ డైరెక్టర్ గా మారిపోతాడు.మరి నందమూరి కళ్యాణ్ రామ్ కి ( Nandamuri Kalyan Ram ) సక్సెస్ ని ఇచ్చిన వశిష్ట చిరంజీవి కి ఎలాంటి సక్సెస్ లు ఇస్తారు అనేది తెలియాల్సి ఉంది.

దేవరలో జాన్వీ నటనపై అనన్య రియాక్షన్ ఇదే.. అలా నటించడం సులువు కాదంటూ?
Advertisement

తాజా వార్తలు