వీడియో: యువకుడి జుట్టు చూసి పక్షి గూడు అనుకున్న పిచ్చుక.. కట్ చేస్తే..

ఏదో ఒక సమయంలో మన జుట్టు అనేది చెదిరి అయిపోతుంది కదా! అప్పుడు జుట్టు అనేది పిచ్చుక గూడులా తయారైందని మనం అంటాం.అలా మనమే కాదు పిచ్చుకలు( sparrows ) కూడా అనుకుంటే? వచ్చి వాలిపోతాయ్ కదూ.ఇటీవల సరిగ్గా అదే జరిగింది.ఓ పక్షి ఒక వ్యక్తి చింపిరి జుట్టుని చూసి గూడు అనుకుంది! ఆపై తలపై వచ్చి వాలింది.

 If A Sparrow Saw The Young Man's Hair And Thought It Was A Bird's Nest, He Woul-TeluguStop.com

దీనికి సంబంధించిన ఓ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది.

వీడియోలో ఆ వ్యక్తి గంపలాగా, రింగులు తిరిగిన జుట్టుపై ఒక పక్షి చాలా తాపీగా కూర్చుని ఉంది.

ఈ విచిత్ర సంఘటన చూశాక “అది జుట్టా, లేదా పక్షి గూడా?” అని పెద్దలు అనే మాట గుర్తుకు వస్తుంది.తన జుట్టు చాలా సౌకర్యంగా ఉందేమో, పక్షి దాన్ని గూడు అనుకుందేమో అని ఆ వ్యక్తి నవ్వుతూ అన్నాడు.

పక్షి కూడా ఏం పట్టించుకోకుండా, ఆ వ్యక్తి ఒత్తుగా ఉండే జుట్టులో చాలా హాయిగా వాలింది.

ఆ వ్యక్తి స్నేహితులు వెంటనే ఈ ఫన్నీ సన్నివేశాన్ని వీడియో తీశారు.పక్షి ఆయన కర్లీ హెయిర్‌లో( curly hair ) సుఖంగా కూర్చుని ఉండగా ఫొటోలు, వీడియోలు తీశారు.అందులో బర్డ్ న్యూ రెస్టింగ్ స్పాట్ ని ఎంజాయ్ చేస్తోంది.

వీడియోలో ఉన్న వ్యక్తి శ్రీలంకలోని శ్రీ దళాద మలిగావా ( Sri Dalada Maligawa in Sri Lanka )మీడియా బ్యూరోలో అధికారి అని తెలిసింది.

జూన్‌లో ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేసిన ఈ వీడియోకు లక్షల కొద్దీ వ్యూస్ వచ్చాయి.జూన్ 30వ తేదీ నాటికి, ఈ వీడియోకి 520,000 లైకులు వచ్చాయి.వీడియో చూసిన నెటిజన్లు లాఫింగ్ ఎమోజీలతో కామెంట్స్ సెక్షన్‌ని ఫిల్ చేశారు.

ఈ ఫన్నీ వీడియో చూసి చాలా మందికి బాగా నవ్వుకున్నారు.మనిషి చెదిరిన జుట్టు పక్షికి గూడులా ఉపయోగపడుతుందా? ఇది చూసేందుకు చాలా చిత్రంగా ఉందే అని అందరూ ఆశ్చర్యపోయారు.ఈ ఫన్నీ పరిస్థితి చూసి చాలా మంది సరదాగా అయ్యో పాపం అని కామెంట్లు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube