గత కొంతకాలంగా ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందరేశ్వరి( Daggupati purandareswari ) వ్యవహారం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.ప్రధానంగా అధికార పార్టీ వైసీపీని టార్గెట్ చేసుకుంటూ టిడిపికి మేలు చేసే విధంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
ముఖ్యంగా వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ( Vijayasai Reddy ) పురందరేశ్వర మధ్య పెద్ద మాటల యుద్దమే జరుగుతుంది.చంద్రబాబుకు మేలు చేసే విధంగా పురందరేశ్వరి రంగంలోకి దిగారని , ఆమె విశాఖ ఎంపీగా పోటీ చేసే ఆలోచనలో ఉన్నారని అనేక విమర్శలు చేస్తున్నారు.
దీనికి తగ్గట్లు గానే వైసీపీ ప్రభుత్వం పై పురందరేశ్వరి అనేక ప్రశ్నలు సంధిస్తున్నారు. కేంద్రం ఇస్తున్న నిధులకు లెక్కలు చెప్పాలని, ఏపీ అప్పులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులు చేస్తున్నారు.
అయితే పురందరేశ్వరి ఒక వర్గం ప్రయోజనాల కోసమే ఈ విధంగా వ్యవహరిస్తున్నారని, ఆమె ఏపీలో బిజెపిని బలోపేతం చేసే విధంగా ఏ చర్యలు తీసుకోవడం లేదని, అంతిమంగా టిడిపికి మేలు చేసే విధంగానే ఆమె వ్యవహార శైలి ఉందని ఫిర్యాదులు ఆ పార్టీ నేతలు నుంచి అధికమయ్యాయి.
ఈ క్రమంలోని ఏపీ బీజేపీ లో( AP BJP ) పరిస్థితిని చక్కదిద్దాలని అధిష్టానం నిర్ణయించింది ముందుగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత ఏపీపై ప్రత్యేక దృష్టి సారించాలని చూసిన ప్రస్తుత పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో కేంద్ర బిజెపి పెద్దలు రంగంలోకి దిగాలని ఆలోచించడంతో ఉన్నారు.ఏపీ బీజేపీ అధ్యక్షురాలుగా పురందేశ్వరి నియామకమైన తర్వాత ఇప్పటివరకు కార్యవర్గ సమావేశం జరగలేదు.ఇప్పుడు అత్యవసరంగా ఒంగోలులో కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు.
అధిష్టానం తరుపున సీనియర్ నేత బి ఎల్ సంతోష్ ( BL Santosh )హాజరవుతున్నారు.దీంతో ఏపీ బీజేపీ ప్రక్షాళన విషయమై సంతోష్ ద్వారా బిజెపి అధిష్టానం కీలక నిర్ణయం వెలువరించనుందా అనే టెన్షన్ పురందరేశ్వరి వర్గంలో కనిపిస్తుంది.ఏపీలో పేరుకి బిజెపితో పొత్తు కొనసాగిస్తున్న జనసేన టిడిపి తో అధికారికంగా పొత్తు పెట్టుకుని అదే సమయంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపితోను పొత్తు పెట్టుకుంది.