ఆదిలాబాద్ జిల్లా( Adilabad District ) ఇంద్రవెల్లిలో( Indravelli ) తెలంగాణ పునర్నిర్మాణ సభ జరిగిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో సభా వేదికపై నుంచి కాంగ్రెస్ ఎన్నికల శంఖారావాన్ని పూరించింది.
రజాకార్లకు వ్యతిరేకంగా కొమురం భీం పోరాడారని తెలిపారు.కొమురం భీం( Komaram Bheem ) పోరాట స్ఫూర్తితోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని పేర్కొన్నారు.
తాము ఏడు వేల ఉద్యోగాలు స్టాఫ్ నర్సులకు ఇచ్చామన్న రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) 15 రోజుల్లో 15 వేల కానిస్టేబుళ్ల పోస్టులు భర్తీ చేసే బాధ్యత మాదని తెలిపారు.త్వరలోనే ప్రియాంక గాంధీ సమక్షంలో రూ.500 కే సిలిండర్ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు.ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా ఇచ్చే బాధ్యత తమదని తెలిపారు.
గత ప్రభుత్వంలో కోటి ఎకరాలకు నీళ్లు ఎక్కడిచ్చారని ప్రశ్నించారు.కోటి ఎకరాలకు నీళ్ల పేరుతో లక్ష కోట్ల రూపాయలు దోచుకున్నారని తెలిపారు.మేం ఈ ప్రాంతానికి సాగునీరు అందిస్తామని పేర్కొన్నారు.తమ ప్రభుత్వాన్ని పడగొడతామంటున్నారని చెప్పారు.మా ప్రభుత్వాన్ని పడగొడతామంటే ప్రజలు ఊరుకుంటారా అని ప్రశ్నించారు.ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వమని తెలిపారు.