బీఆర్ఎస్( BRS ) ప్రభుత్వంలో ఐటీ శాఖ మంత్రిగా అందరి ప్రశంసలు అందుకున్నారు కెసిఆర్ తనయుడు కేటీఆర్.అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయింది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.ఇక కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి ( Revanth reddy ) తో పాటు ఇప్పటికే 11 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు.
అయితే వీరెవరికి కూడా ఇంకా శాఖలను కేటాయించలేదు.అయితే కాంగ్రెస్లో కొత్త ఐటీ శాఖ మంత్రి ఎవరు అనే దాని గురించి తెలంగాణ యువతలో ఉత్కంఠ నెలకొంది.
ఇక విషయంలోకి వెళ్తే.కాంగ్రెస్ లో ప్రమాణ స్వీకారం చేసిన 11 మంది మంత్రుల్లో అందరూ సీనియర్ నాయకులే.
అలాగే వీరు ఐటి శాఖ మంత్రులుగా ఇప్పటివరకు ఎలాంటి భాద్యతలు తీసుకోలేదని తెలుస్తోంది.
అయితే విశ్వసనీయ సమాచారం ప్రకారం.
దుద్దిళ్ల శ్రీధర్ బాబు ( Duddilla Sridhar babu ) లేదా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఐటి శాఖ ని రేవంత్ రెడ్డి కేటాయించే సూచనలు కనిపిస్తున్నాయి.ఇక నిన్న మొన్నటి వరకు ఇద్దరి పేర్లు వినిపించినప్పటికీ తాజాగా ఎల్లారెడ్డి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే కల్వకుంట్ల మదన్ మోహన్ రావు పేరు కూడా గట్టిగా వినిపిస్తోంది.
అయితే మదన్ మోహన్ రావు కి ఐటి శాఖ మీద కాస్త పట్టు ఉందని, అలాగే ఈయనకు సాఫ్ట్వేర్ కంపెనీ కూడా ఉందని తెలుస్తుంది.
అంతేకాకుండా ఈయన గతంలో రాహుల్ గాంధీ టీంలో పని చేస్తూ కాంగ్రెస్ కి చాలా సహాయం చేశారని, ఎలక్షన్స్ లో అనలిటిక్స్, సభ్యత్వ నమోదు వంటి విషయాల్లో ఈయన ముందుండి నడిపించారని తెలుస్తోంది.ఇక అమెరికాలో ఐటి బిజినెస్ నడుపుతున్న కల్వకుంట్ల మదన్ మోహన్ రావు ( Kalvakuntla Madan mohan rao ) కి ఐటి శాఖ మంత్రిని చేయాలి అని అధిష్టానంలో ఒక చర్చ జరుగుతుందట.ఇక ఇప్పటికే 11 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కల్వకుంట్ల మదన్ మోహన్ రావు లకు కూడా క్యాబినెట్ లో పదవి ఇవ్వాలి అని రేవంత్ రెడ్డి భావిస్తున్నారట.
ఈ నేపథ్యంలోనే కొత్త ఐటి శాఖ మంత్రి ఎవరు అనేదానిపై తెర పడడం లేదు.ఇందులో ముఖ్యంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి( Komatireddy Venkata reddy ) ,దుదిల్ల శ్రీధర్ బాబు, కల్వకుంట్ల మదరమోహన్ రావు పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి.అయితే ఐటి శాఖ మంత్రులుగా వీరి పేర్లు వినిపిస్తున్న తరుణంలో వీరు కేటీఆర్ ని మరిపించేలా చేస్తారా అని యువతలో ఒక అనుమానం మొదలైంది.ఇక కేటీఆర్ ఐటి శాఖ మంత్రిగా ఉండి ఎన్నో కంపెనీలను హైదరాబాద్ కు తీసుకువచ్చి వేలాదిమంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించారు.
మన రాష్ట్రానికి ఐటి కంపెనీ రావడానికి ప్రధాన కారణం కూడా కేటీఆరే.అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీ హైదరాబాదు ( Hyderabad ) లో చాలా స్థానాల్లో గెలిచింది అంటే దానికి ప్రధాన కారణం కూడా కేటీఆర్ చేసిన అభివృద్దే అని తెలుస్తోంది.ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్లో ఉండే ఐటి శాఖ మంత్రి కేటీఆర్ ( KTR ) ని మరిపించేలా కొత్త కొత్త కంపెనీలను హైదరాబాద్ కు తీసుకు వస్తారా అనే ప్రశ్న యువతకి వస్తుంది.అంతే కాదు ఐటీ శాఖ మంత్రిగా కేటీఆర్ కి ఎవరూ కూడా సాటిరారు అని చెబుతున్నారు.
మరి చూడాలి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఐటీ శాఖ మంత్రిగా ఎవరికి పదవి దక్కుతుందో.