ఆ రాష్ట్రాల సీఎంలు జగన్ కు సాయం చేస్తారా.. జగన్ షణ్ముక వ్యూహాన్ని ఎలా చేధిస్తారు

ఏపీ రాజకీయాల్లో ఇప్పుడంతా ఎన్నికల ఫీవర్ నడుస్తోంది.ఇప్పటి నుంచే సార్వత్రిక ఎన్నికలకు పొలిటికల్ పార్టీలు అన్నీ సిద్ధమవుతున్నాయి.

ఎలాగైనా సరే అధికారంలో ఉన్న వైసీపీని గద్దె దించాలని ప్లాన్ వేస్తున్నాయి.ఈ నేపథ్యంలోనే ఇటీవల ఆవిర్భావ సభ జరిపిన జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆ సభలో మాట్లాడుతూ.

షణ్ముక వ్యూహం అనుసరించి అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డిని గద్దె దించుతానని ప్రకటించారు.మరో వైపు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ పార్టీ కూడా ఎలాగైనా సరే వైసీపీని ఓడించి అధికారం తిరిగి చేజిక్కించుకోవాలని చూస్తోంది.

ఇటువంటి తరుణంలో వైసీపీ పార్టీ ఏం చేస్తుందా? ప్రత్యర్థి పార్టీల వ్యూహాలను ఎలా ఎదుర్కొంటుందా ? అన్న ప్రశ్నలు అందరిలో మొదలయ్యాయి.

Advertisement

పవన్ కల్యాణ్ ప్రకటించిన షణ్ముక వ్యూహంలో ప్రధానంగా వైసీపీ వ్యతిరేఖ ఓటు చీల్చకుండా ఉంచడం, పక్క పార్టీలను కలుపుకుని ఎన్నికలకు పోవడం మెయిన్ గా ఉన్నాయి.కానీ ఇటువంటి తరుణంలో ఏపీలో అధికారంలో లేని పార్టీలు అన్నీ ఏకతాటి మీదికి వస్తాయా అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.ఇక ఇదే తరుణంలో అధికారంలో ఉన్న సీఎం జగన్మోహన్ రెడ్డి పక్క రాష్ట్రాల సీఎంల మద్దతు తప్పనిసరిగా తీసుకుంటారనే చర్చ జోరుగా నడుస్తోంది.

తమిళనాడు, ఒడిషా, తెలంగాణ ముఖ్యమంత్రులు జగన్ కు మంచి మిత్రులుగా ఉన్నారు.జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో వీరి సాయం తప్పకుండా తీసుకుంటాడని ప్రచారం జరుగుతోంది.ఇంకా అదే కాక వీరంతా కూడా ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబుతో ఎక్కువగా పడని నేతలు.

కావున ఈ నేతలు తప్పకుండా జగన్ కు సాయం చేస్తారని రాజకీయ విశ్లేషకులు చాలా బలంగా చెబుతున్నారు.ఇక ఈ పరిస్థితుల్లో ఏపీ రాజకీయాలు ఎటువంటి మలుపులు తీసుకుంటాయో వేచి చూడాలి.

మొటిమ‌ల‌ను సులువుగా నివారించే జామాకులు..ఎలాగంటే?
Advertisement

తాజా వార్తలు