కాంగ్రెస్ ప్రచారాలు కలిసొస్తాయా ?

తెలంగాణ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ( Congress party ) యమ దూకుడుగా వ్యవహృస్తున్న సంగతి తెలిసిందే.సౌత్ రాష్ట్రాలలో ఇప్పటికే కర్నాటకలో అధికారంలోకి వచ్చిన హస్తం పార్టీ ఇప్పుడు తెలంగాణలో కూడా అధికారం సంపాధించాలని ఉవ్విళ్లూరుతోంది.

 Will The Campaigns Of Congress Work, Congress Party , Cm Kcr , Ts Politics, Brs-TeluguStop.com

కాగా తెలంగాణ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారాలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా నిలుస్తున్నాయి.ముఖ్యంగా కే‌సి‌ఆర్ టార్గెట్ గా కాంగ్రెస్ చేస్తున్న వినూత్న ప్రచారాలు ప్రజల్లోకి బలంగా వెళుతున్నాయి.

గత తొమ్మిదేళ్ల కే‌సి‌ఆర్ పాలనలో జరిగిన అవినీతిని ప్రజలకు తెలిపేలా ప్రచారాలు నిర్వహిస్తున్నారు.

Telugu Brs, Cm Kcr, Congress, Revanth Reddy, Ts-Politics

కే‌సి‌ఆర్ పోలిన వ్యక్తితో కూడిన ప్రకటనలు ఇప్పటికే రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి కూడా.రుణమాఫీ చేయకుండా రైతులను మోసం చేశారని, ధరణి ప్రవేశ పెట్టి పేదల భూములను కే‌సి‌ఆర్ స్వాహా చేస్తున్నారని, కాళేశ్వరంలో వేల కోట్లు అవినీతికి పాల్పడ్డారని.ఇలా కే‌సి‌ఆర్( CM KCR ) టార్గెట్ గా ఎన్నో అంశాలను లేవనెత్తుతూ అందరినీ ఆలోచింపజేసేలా చూస్తోంది హస్తం పార్టీ.

కాంగ్రెస్ చేస్తున్న వినూత్న ప్రచారాల ధాటికి అధికార బి‌ఆర్‌ఎస్ ఏకంగా ఈసీ ని ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది.కాంగ్రెస్ చేస్తున్న ప్రకటనలు కే‌సి‌ఆర్ పరువును దెబ్బ తీసేలా ఉన్నాయని, బి‌ఆర్‌ఎస్ పార్టీ విధానాలను దెబ్బ తీసేలా ఉన్నాయని ఆల్రెడీ బి‌ఆర్‌ఎస్ నేతలు ఫిర్యాదు చేయడంతో హస్తం పార్టీ ప్రకటనలోని కొన్నిటిని ఈసీ ఇప్పటికే నిలువరించింది.

Telugu Brs, Cm Kcr, Congress, Revanth Reddy, Ts-Politics

అయితే ఇలోపే బి‌ఆర్‌ఎస్ ( BRS )కు జరగాల్సిన నష్టం చాలానే జరిగిపోయింది.కే‌సి‌ఆర్ పాలనపై కాంగ్రెస్ చేసిన సెటైరికల్ ప్రకటనలు గ్రామస్థాయి వరకు నానా హడావిడి చేస్తున్నాయి.దీంతో బి‌ఆర్‌ఎస్ తో పోల్చితే ప్రస్తుతం ప్రచార విభాగంలో హస్తం పార్టీనే కొంత ముందు వరుసలో ఉన్నట్లు తెలుస్తోంది.కాంగ్రెస్ చేస్తున్న వినూత్న ప్రచారలకు అటు బి‌ఆర్‌ఎస్ కు షాక్ తగలడంతో పాటు సొంత పార్టీకి బాగానే మైలేజ్ పెరుగుతోందని హస్తం నేతలు ఉత్సాహంతో ఉన్నారు.

అయితే కేవలం ప్రచారాలే పార్టీకి విజయాన్ని కట్టబెడతాయా అంటే చెప్పడం కష్టమే మరి హస్తం పార్టీకి ప్రచారాలు ఎంతవరకు కలిసొస్తాయో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube