బీజేపీ తో టీడీపీ కలుస్తుందంటే ... ? అచ్చెన్నను ఆన్సర్ అడిగిన వీర్రాజు 

టీడీపీ( TDP ) తో పొత్తు అనే ప్రతిపాదన వచ్చిన ప్రతిసారి చాలా సీరియస్ గానే రియాక్ట్ అవుతూ ఉంటారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు( Somu Viraraju ).  మొదటి నుంచి ఆయన టిడిపి వ్యతిరేక విధానాన్ని అవలంబిస్తూ వస్తున్నారు.

 Will Tdp Meet With Bjp Veeraraju Asked Achchenna For An Answer , Ap Bjp, Tdp, J-TeluguStop.com

అంతేకాదు టిడిపి నుంచి బిజెపిలో చేరిన కొంతమంది కీలక నాయకులు విషయంలోనూ వీర్రాజు అనుమానంగానే వారిని చూస్తూ,  వారితో ఆంటీ  ముట్టనట్టుగా వ్యవహరిస్తూ ఉంటారు.ఇదిలా ఉంటే గత కొద్ది రోజులుగా బిజెపి , టిడిపి లు పొత్తు పెట్టుకోబోతున్నాయని ప్రచారం ఏపీలో తీవ్రమైంది.

Telugu Achchenna, Ap Bjp, Ap, Jagan, Janasena, Pawan Kalyan, Somu Veerraju, Ysrc

జనసేన, బీజేపీ , టిడిపిలు కలిసి పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లే ఆలోచనతో ఉన్నాయని, ఇదే విషయమై ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఢిల్లీకి వెళ్లి మరి కేంద్ర బిజెపి పెద్దలను ఒప్పించే ప్రయత్నం చేశారని ప్రచారం జరిగింది.  ఇక వైసీపీ బీజేపీ ల మధ్య రహస్య పొత్తులు కొనసాగుతున్న అంటూ ప్రచారం కూడా ఏపీలో  జరుగుతోంది.

Telugu Achchenna, Ap Bjp, Ap, Jagan, Janasena, Pawan Kalyan, Somu Veerraju, Ysrc

ఈ వ్యవహారం ఇలా ఉంటే … తాజాగా ఇదే అంశంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడారు.  టిడిపి ఏపీ అధ్యక్షుడు అచ్చెన్న నాయుడు( Achchenna Naidu ) పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.అసలు ఈ స్థాయిలో అచ్చెన్న పై వీర్రాజు కు కోపం రావడానికి కారణం బిజెపి,  వైసీపీలు కలిసి లేవని ప్రజలు చెప్పాలంటూ అచ్చెన్న చేసిన వ్యాఖ్యలే కారణం.దీనిపై స్పందించిన వీర్రాజు మాతో ఎవరు కలిసి ఉన్నారో లేదో మేమే చెప్పాలని అన్నారు.

అసలు బిజెపితో టిడిపి కలుస్తుందంటే అచ్చెన్న నాయుడు ఏం సమాధానం చెబుతారు అంటూ వీర్రాజు ప్రశ్నించారు.

Telugu Achchenna, Ap Bjp, Ap, Jagan, Janasena, Pawan Kalyan, Somu Veerraju, Ysrc

ఓ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సోము వీర్రాజు ఈ వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఏపీలో బిజెపిని పటిష్టం చేసేందుకు బిజెపి కోర్ కమిటీ సమావేశం జరుగుతోందని,  ఈ సమావేశంలో పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలనే దానిపై తగిన నిర్ణయం తీసుకుంటామని వీర్రాజు అన్నారు .ఈరోజు ప్రముఖ పారిశ్రామికవేత్త తులసి రామచంద్ర ప్రభు బిజెపిలో చేరుతున్నారని ఆయన తెలిపారు.అలాగే త్వరలోనే వైసిపి, టిడిపి , కాంగ్రెస్ ల నుంచి భారీగా చేరికలు ఉండబోతున్నాయని వీర్రాజు అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube