కంగువా సినిమాతో సూర్య పాన్ ఇండియా హీరోగా మారతాడా..?

తమిళ్ సినిమా ఇండస్ట్రీలో సూర్య( Surya ) గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఆయన తీసిన సినిమాలన్నీ సూపర్ సక్సెస్ అవ్వడమే కాకుండా అటు తమిళ్, ఇటు తెలుగు రెండు భాషల్లో కూడా భారీ సక్సెస్ లను అందుకున్న ఏకైక హీరోగా కూడా మంచి గుర్తింపును సంపాదించుకుంటున్నాడు.

ఇక ఇలాంటి క్రమంలోనే సూర్య చేస్తున్న కంగువ సినిమాతో( Kanguva ) సక్సెస్ ని అందుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు.ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమా నుంచి ఈరోజు వచ్చిన ట్రైలర్ చాలా ఎక్స్ ట్రా ఆర్డినరీ విజువల్స్ తో ఉండడమే కాకుండా సినిమా మీద మంచి అంచనాలను అయితే పెంచేస్తుంది.

ఇక ఈ ట్రైలర్ ను( Trailer ) కనక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులో సూర్య చాలా డిఫరెంట్ క్యారెక్టర్ ని పోషించినట్టుగా తెలుస్తుంది.ఇక ఇది ఒక రివేంజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీ గా కూడా రానున్నట్టుగా మనకైతే చాలా క్లారిటీగా తెలుస్తుంది.మరి అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా మీద డైరెక్టర్ శివ( Director Shiva ) చాలా కేర్ తీసుకొని మరి ఈ సినిమాని తెరకెక్కించినట్టుగా తెలుస్తుంది.

ఇక ఇప్పటివరకు రొటీన్ సినిమాలను చేసిన శివ ఈ సినిమాతో ఒక వెరైటీ సినిమాను చేసి డిఫరెంట్ టేస్ట్ ఉన్న దర్శకుడి గా తనను తాను ప్రూవ్ చేసుకోవాలని ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది.మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందనే విషయం తెలీదు గానీ ఈ సినిమా అక్టోబర్ 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తుంది.మరి దాన్ని ఉద్దేశించి ఈ సినిమా మంచి సక్సెస్ ని సాధిస్తుందా లేదా అనేది తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే.

Advertisement

ఇక ఈ సినిమాతో కనుక మంచి సక్సెస్ ని అందుకుంటే సూర్య ఇండియాలోనే టాప్ హీరోగా ఎదుగుతాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

కాకినాడ సీపోర్ట్ వ్యవహారం .. సాయిరెడ్డి తో పాటు వీరికీ ఈడి నోటీసులు
Advertisement

తాజా వార్తలు