చిన్న రాజకీయ పార్టీలే వచ్చే ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనున్నాయా?

తెలంగాణలో రాజకీయం అనేది అధికార, ప్రతిపక్ష పార్టీల మాటల తూటాలతో పెద్ద ఎత్తున ఆసక్తికరంగా రంజుగా మారింది.

గత రెండు సార్వత్రిక ఎన్నికల కంటే ముందు టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు మాత్రమే తెలంగాణలో బలమైన పార్టీలుగా ఉండేవి.

కాని ఆ తరువాత బీజేపీ, యువ తెలంగాణ, బీఎస్పీ, వైయస్సార్ టీపీ ఇలా చాలా రకాల పార్టీలు పొలిటికల్ పిక్చర్ లోకి రావడంతో తెలంగాణలో రాజకీయ వాతావరణం అనేది ఒక్కసారిగా మునుపెన్నడూ లేనంతగా మారిపోయిందని చెప్పవచ్చు.అయితే ప్రస్తుతం చిన్న చిన్న రాజకీయ పార్టీలు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎటువంటి పాత్ర పోషిస్తాయనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాలలో పెద్ద ఎత్తున జరుగుతోంది.

అయితే ప్రస్తుతం బీఎస్పీ, వైయస్సార్ టీపీ లాంటి పార్టీలు చాలా నిమిత్త మాత్రంగా అధికార పక్షాన్ని ఢీ కొనేంత సత్తా లేకున్నా సదరు పార్టీలు సాధించిన ఎమ్మెల్యే స్థానాలు ఒకవేళ రాష్ట్రంలో హంగ్ ఏర్పడితే ఈ చిన్న చిన్న పార్టీలే ప్రభుత్వ ఏర్పాటులో కీలకపాత్ర పోషించే అవకాశం ఉంది.అంతేకాక ఒకవేళ ఈ పార్టీలు మద్దతిచ్చిన పార్టీనే ఎక్కువగా గెలిచేందుకు ఎక్కువగా అవకాశం ఉంది.అయితే ప్రస్తుతం బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ లాంటి పార్టీలు ఈ పార్టీలతో చర్చలు జరపడం కాని చేయకున్నా ఎన్నికల సమయంలో చిన్న చిన్న పార్టీలు ఏదైనా ఒక పార్టీకి మద్దతివ్వక తప్పదు.

అయితే ఆ సమయంలో ఏ పార్టీకి మద్దతిస్తాయనేది మనం ఇప్పుడే బలంగా చెప్పలేకపోయినా వీటి పాత్ర కీలకంగా ఉండే అవకాశం ఉంది.ఎందుకంటే ఇప్పటికే అన్ని పార్టీలు టీఆర్ఎస్ పార్టీ టార్గెట్ గానే విమర్శల వర్షం కురిపిస్తున్న సందర్భంలో రానున్న రోజుల్లో ఈ పార్టీలు టీఆర్ఎస్ పార్టీకి మద్దతిచ్చే అవకాశం అయితే ఉండే అవకాశం లేదు.

Advertisement
ఇంతకీ ఆ గోడ కట్టింది ఎవరు ? టీడీపీ వర్సెస్ వైసిపి
" autoplay>

తాజా వార్తలు