హుజూరాబాద్‌లో రేవంత్ ప్లాన్ టీఆర్ ఎస్‌ను దెబ్బ కొడుతుందా..?

హుజూరాబాద్ వేడి రోజు రోజుకూ పెరుగుతోంది.ఇక్క‌డ గెలిచి త‌మ ఉనికిని చాటుకోవ‌డంతో పాటు బ‌లాన్ని పెంచుకోవాలి బీజేపీ తీవ్ర స్థాయిలో పోరాడుతోంది.

మ‌రోవైపు టీఆర్ఎస్ కూడా ఎలాగైనా గెలిచి త‌మ‌కు తిరుగులేద‌ని, బీజేపీకి తెలంగాణ‌లో అవ‌కాశం లేద‌ని చెప్పేందుకు పావులు బాగానే క‌దుపుతోంది.ప్ర‌ధానంగా ఈ రెండు పార్టీల న‌డుమ‌నే పోటీ ఉంద‌నే విష‌యం అంద‌రికీ తెలిసిందే.

అయితే కాంగ్రెస్ కూడా ప‌క్కా వ్యూహాల‌తోనే ముందుకు వెళ్తోంది.పైగా రేవంత్ రెడ్డి ప‌గ్గాలు తీసుకున్న త‌ర్వాత వ‌చ్చిన మొద‌టి ఎన్నిక కావ‌డంతో ఓ భారీ ప్లాన్ వేసిన‌ట్టు తెలుస్తోంది.

ఈ నియోజ‌క‌వ‌ర్గంలో అభ్య‌ర్థిగా బ‌ల్మూరి వెంక‌ట్ ను దించిన‌ప్పుడే రేవంత్ ఓ ఐడియాకు వ‌చ్చేశారు.అదేంటంటే ఈ హుజూరాబాద్‌లో ఉన్న నిరుద్యోగుల‌ను ఆయ‌న టార్గెట్ చేసిన‌ట్టు తెలుస్తోంది.

Advertisement

వీరి ఓట్ల‌ను టార్గెట్ చేసే క్ర‌మంలోనే విద్యార్థి నాయుకుడు అయిన బ‌ల్మూరి వెంక‌ట్‌ను రంగంలోకి దింపిన‌ట్టు తెలుస్తోంది.రీసెంట్ గా కాంగ్రెస్ కూడా నిరుద్యోగం మీద గట్టిగా మాట్లాడుతునే ఉంది.

ఇలాంటి ఇక వైఎస్ షర్మిల కూడా నిరుద్యోగ ఎజెండాతోనే ముందుకు వెళ్తుండ‌టంతో ఈ నినాదం గ‌ట్టిగానే ప‌నిచేస్తుంద‌ని రేవంత్ భావిస్తున్నారంట‌.

కాగా ఇప్ప‌టికే నియోజకవర్గంలో 36 వేలమంది నిరుద్యోగులు ఉన్న విష‌యాన్ని గుర్తించిన కాంగ్రెస్ వారి ఓట్ల‌ను గంప గుత్త‌గా త‌మ‌వైపు వేసుకునేందుకు రెడీ అవుతోంది.ఉద్యమ సమయంలో కేసీఆర్ ఉద్యోగాల భ‌ర్తీపై చేసిన వ్యాఖ్య‌ల‌ను ప్ర‌ద‌ర్శిస్తూ త‌మ‌కు అనుకూలంగా యువ‌త‌ను ఆక‌ర్షించాల‌ని ప్లాన్ చేస్తున్నారు కాంగ్రెస్ నేత‌లు.ఇక వెంకట్ తరపున ఎన్ఎస్‌ యూఐతో పాటు యూత్ కాంగ్రెస్ లో ఉండే బ‌ల‌మైన యూత్ నేత‌లు కూడా దీన్నే ప్ర‌ధాన అస్త్రంగా వాడుతున్న‌ట్టు తెలుస్తోంది.

చూడాలి మ‌రి రేవంత్ ప్లాన్ ఏ మేర‌కు స‌క్సెస్ అవుతుందో.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు