మంగళగిరిలో లోకేష్ జెండా పాతేనా ?

ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో( AP politics ) మంగళగిరికి సంబంధించిన చర్చ జోరుగా జరుగుతోంది.

ఆ నియోజక వర్గ ఎమ్మెల్యేగా ఉన్న ఆళ్ళ రామకృష్ణరెడ్డి సడన్ గా రాజీనామా చేయడంతో పాటు వైసీపీకి కూడా గుడ్ బై చెప్పారు.

దీంతో నియోజక వర్గ బాద్యతలను గంజి చిరంజీవి చేతిలో పెట్టారు వైఎస్ జగన్.( YS Jagan ) గత ఎన్నికల్లో టీడీపీ నుంచి నారా లోకేష్ పోటీలో నిలిచారు కానీ వైసీపీ నుంచి పోటీ చేసిన ఆళ్ళ రామకృష్ణ రెడ్డి( Alla Ramakrishna Reddy ) చేతిలో ఓటమి చవిచూశారు.

అయితే ఈసారి ఆళ్ళ రామకృష్ణ రెడ్డి వైసీపీకి రాజీనామా చేయడంతో లోకేష్ కు మంగళగిరిలో తిరుగు లేదనే టాక్ వినిపిస్తోంది.

పైగా ఓటమి తరువాత నారా లోకేష్( Nara Lokesh ) నిత్యం నియోజక వర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ వచ్చారు.అంతే కాకుండా యువగళం పాదయాత్ర ద్వారా రాజకీయాల్లో పరిణితి సాధించారు.దాంతో ఈసారి లోకేష్ మంగళగిరిలో విజయం సాధించడం ఖాయమని టీడీపీ( TDP ) శ్రేణులు భావిస్తున్నారు.

Advertisement

అయితే ఈసారి మంగళగిరి నుంచి గంజి చిరంజీవి బరిలో నిలిచే అవకాశం ఉంది.పద్మశాలి వర్గానికి చెందిన గంజికి నియోజక వర్గంలో బాగానే పట్టుంది.అంతేకాకుండా మంగళగిరిలో దాదాపు 60 పైగా పద్మశాలి వర్గానికి చెందిన ఓటర్లు ఉన్నారు.

వీరంతా సామాజిక వర్గ దృష్ట్యా గంజి చిరంజీవి వైపే మొగ్గు చూపుతే ఈసారి కూడా నారా లోకేష్ కు నిరాశ తప్పదనే టాక్ కూడా వినిపిస్తోంది.అందుకే ఈసారి మంగళగిరి సీటును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది తెలుగుదేశం పార్టీ.గత ఎన్నికలో ఓటమికి గల కారణాలను సరిచేసుకుంటూ నియోజకవర్గంలో టిడిపి బలపడేలా చంద్రబాబు( Chandrababu ) గట్టిగానే ప్లాన్ చేస్తూ వచ్చారు.

దానికి తోడు వచ్చే ఎన్నికల్లో కూడా లోకేశ్ మంగళగిరి నుంచే పోటీ చేయబోతున్నట్లు మొదట్లోనే ప్రకటించడంతో ఈసారి లోకేశ్ ఎలాగైనా గెలిచేలా చంద్రబాబు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది.ఇక లోకేశ్ కూడా నిత్యం నియోజకవర్గంలో పర్యటిస్తూ.

ప్రజలకు తరచూ అందుబాటులో ఉంటున్నారు.మరి లోకేశ్ ఈసారి ఎన్నికలో గెలిచి మంగలగిరిలో నుంచి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెడతారేమో చూడాలి.

ఎంతో టాలెంట్ ఉన్నా లక్ లేక వెనుకబడిన సత్యదేవ్.. లక్ కలిసిరావట్లేదా?
Advertisement

తాజా వార్తలు