కేంద్రంలో కే‌సి‌ఆర్ వ్యూహం ఫలిస్తుందా ?

తెలంగాణ ముఖ్యమంత్రి కే‌సి‌ఆర్( cm kcr ) జాతీయ రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటున్న సంగతి తెలిసిందే.

దేశ వ్యాప్తంగా బి‌ఆర్‌ఎస్ ను విస్తరించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.

వచ్చే ఎన్నికతో కేంద్రంలో బి‌ఆర్‌ఎస్ ముద్రా వేయాలని బలంగా ఫిక్స్ అయ్యారు.అయితే అటు ఎన్డీయే కూటమికి గాని ఇటు ఇండియా కూటమికి గాని దూరంగా ఉన్న కే‌సి‌ఆర్.

కేంద్రంలో సత్తా చాటే అవకాశం ఉందా ? అనే ప్రశ్నలకు కే‌సి‌ఆర్ వ్యూహాలే సమాధానంగా నిలుస్తున్నాయి.ప్రస్తుతం కే‌సి‌ఆర్ దృష్టంతా మహారాష్ట్రపైనే ఉంది.

ఆ రాష్ట్రంలో పార్టీ బలోపేతం కోసం ముమ్మరంగా కృషి చేస్తున్నారు.

Advertisement

ఇప్పటికే మహారాష్ట్ర( Maharashtra )లో ఇతర పార్టీల నుంచి చాలమంది నేతలను బి‌ఆర్‌ఎస్ వైపు ఆకర్షించిన కే‌సి‌ఆర్ వచ్చే ఎన్నికల్లో వచ్చేది బి‌ఆర్‌ఎస్ ప్రభుత్వమే అనే ధీమా వ్యక్తం చేస్తున్నారు.అయితే మహారాష్ట్రలో బి‌ఆర్‌ఎస్ కు లభించే విజయాన్ని బట్టే కేంద్రంలో ఆ పార్టీ పాత్ర ఉండబోతుందని ఇటీవల కే‌సి‌ఆర్ చేసిన వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది.మహారాష్ట్రలోని 48 లోక్ సభ స్థానాలు మరియు తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాలు కైవసం చేసుకుంటే కేంద్రంలో చక్రం తిప్పవచ్చనే వ్యూహంలో కే‌సి‌ఆర్ ఉన్నారు.

అందుకంటే ప్రస్తుతం రేస్ లో ఉన్న ఎన్డీయే కూటమి మరియు ఇండియా కూటమి మద్య గట్టి పోటీ ఉండే అవకాశం ఉంది.

ఈ రెండు కూటముల మద్య స్పష్టమైన ఆధిక్యం కనబడకపోతే.అప్పుడు బి‌ఆర్‌ఎస్( BRS party ) ముఖ్యపాత్ర పోషించే అవకాశం ఉందనే ఆలోచనలో కే‌సి‌ఆర్ ఉన్నారు.అందుకే అన్నీ రాష్ట్రాలపై దృష్టి పెత్తకుండా గెలుపు ఖాయమనుకునే రాష్ట్రాలపైనే కే‌సి‌ఆర్ ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది.

గత కొన్నాళ్లుగా మహారాష్ట్రలో బి‌ఆర్‌ఎస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది.ఆ రాష్ట్ర ఎన్నికల నాటికి అక్కడి స్థానిక పార్టీలకు గట్టి పోటీనిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

వీడియో వైరల్ : ఇదేందయ్యా ఇది.. ఆవు అక్కడికి ఎలా వెళ్లిందబ్బా..?
Covid Declining Covid Cases In India Health Covid India Corona COVIDCases CovidIn

అందుకే రాష్ట్రంలోని 48 ఎంపీ స్థానాలను సొంతం చేసుకోవాలనే లక్ష్యంతో ఉన్నారు గులాబీ బాస్.మరి కే‌సి‌ఆర్ .వ్యూహాలు ఎంతవరుకు ఫలిస్తాయో చూడాలి.

Advertisement

తాజా వార్తలు