ఏపీలో రోజుకు ఒక్కసారైనా చర్చకు వచ్చే అంశం ఏదైనా ఉందా అంటే అది ప్రత్యేక హోదా( AP Special Status ) అంశమనే చెప్పాలి.రాష్ట్రం విడిపోయిన తరువాత ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని అప్పుడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్( Congress Party ) ప్రకటించింది.
అయితే ఊహించని విధంగా 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర ఓటమిపాలు అయి ప్రభుత్వాన్ని కోల్పోయింది.ఇక ఆ తరువాత ప్రత్యేక హోదా అంశాన్ని అధికారంలోకి వచ్చిన బిజెపి సర్కార్ ముందు ఎన్ని సార్లు ప్రస్తావించినా ఏమాత్రం ఫలితం లేకపోయింది.
గతంలో ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన మోడి సర్కార్ కూడా దాటవేసే దొరణినే అవలంభించారు.

ఇంకా చెప్పాలంటే ప్రత్యేక హోదా ఇచ్చే ప్రసక్తే లేదని తెగేసి చెప్పేశారు.ఇటు రాష్ట్రంలోని జగన్ సర్కార్( CM Jagan ) కూడా ప్రత్యేక హోదా పై అరకొర డిమాండ్లు చేస్తున్నప్పటికి పోరాటం దిశగా ఎప్పుడు ప్రయత్నించలేదనే చెప్పాలి.ఇదిలా ఉంచితే ఏపీలో 2024 అసంబ్లీ ఎన్నికలకు ఎంతో సమయం లేదు.
ఈ నేపథ్యంలో మళ్ళీ ప్రత్యేక హోదా అంశం తెరపైకి వస్తోంది.గత ఎన్నికల ముందు కేంద్రం మేడలు ఒంచైనా ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పిన జగన్.
ఈసారి హోదా విషయంలో ఎలాంటి స్టాండ్ తీసుకుంటారనేది అందరిలోనూ ఆసక్తి రేపుతున్న అంశం.అయితే వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి( MP Mithun Reddy ) తాజాగా హోదా విషయంలో స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

వచ్చే ఎన్నికల్లో వైసీపీకి( YCP ) ఏ పార్టీతో పొత్తు ఉండదని చెబుతూనే.ప్రత్యేకహోదా ఇస్తామంటే ఏ పార్టీకైనా మద్దతిస్తామని చెప్పుకొచ్చారు.కాగా రాహుల్ గాంధీ( Rahul Gandhi ) భారత్ జోడో యాత్రలో భాగంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది కాంగ్రెస్ పార్టీనే అని.తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారు.దీన్ని బట్టి చూస్తే వైసీపీ.కేంద్రంలో కాంగ్రెస్ కు మద్దతుగా నిలిచే అవకాశం ఉందా అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి.ఇప్పటివరకు బీజేపీ ప్రత్యేక హోదా విషయంలో ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే స్పెషల్ స్టేటస్ విషయంలో పూర్తి హామీ ప్రకటించింది.
దీంతో ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురావడం జగన్ ప్రధాన ఎజెండా అయితే కాంగ్రెస్ తో చేతులు కలపడం తప్పా వేరే దారి లేదనేది కొందరు చెబుతున్నా మాట.మరి వైఎస్ జగన్ స్పెషల్ స్టేటస్ విషయంలో ఎలా ముందుకెళ్తారో చూడాలి.