తెలంగాణ బీజేపీ(Telangana Bjp) లో కీలక మార్పులు చోటు చేసుకున్నా సంగతి తెలిసిందే.బండి సంజయ్ ని అధ్యక్ష పదవి నుంచి తప్పించి.
ఆ స్థానంలో కిషన్ రెడ్డిని (Kishan Reddy)నియమించింది అధిష్టానం.ఇక ఎప్పటి నుంచో పార్టీలో ప్రదాన్యం లేదని అసంతృప్తిగా ఉన్న ఈటెలకు ఎన్నికల వ్యవహార కమిటీ చైర్మెన్ బాద్యతలు అప్పగించింది.
పార్టీలో సీనియర్ నేతలు చాలమందే ఉన్నప్పటికి ఎన్నికల కమిటీ చైర్మెన్ పదవి బాద్యతలు ఈటెలకె అప్పగించింది అధిష్టానం.ఇంత కీలకమైన బాధ్యతలు ఈటెలకే అప్పటించడం వెనుక బీజేపీ మాస్టర్ ప్లాన్ ఉందనేది విశ్లేషకులు చెబుతున్నా మాట.

రాజకీయాల్లో ఈటెల రాజేందర్ (Etela Rajender)సుధీర్ఘ అనుభవం కలిగిన వ్యక్తి.పైగా బిఆర్‌ఎస్ ( అప్పటి టిఆర్‌ఎస్ ) లో అనువనువు తెలిసిన వ్యక్తి కావడంతో కేసిఆర్ వ్యూహరచనపై, బిఆర్‌ఎస్ (Brs)పార్టీ బలాబలహీనతలపై ఈటెలకు మంచి పట్టు ఉంది.ఈ కారణం చేతనే ఈటెలకు ఎన్నికల వ్యవహార కమిటీ చైర్మెన్ బాద్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది.ఈటెల రాజకీయ చతురత గురించి గతంలో కేసిఆర్ కూడా చాలాసార్లు ప్రస్తావించారు.
దీంతో ఇప్పుడు బిఆర్‌ఎస్ ను ఎదుర్కొనేందుకు బీజేపీ ఈటెల రాజేందర్ నే ప్రయోగిస్తుండడంతో ఈటెల కేసిఆర్ ను వ్యూహాలను ఎలా ఎదుర్కొంటాడనే ఆసక్తి అందరిలోనూ తాజాగా తన పదవి పై స్పందిస్తూ ఈటెల చేసిన వ్యాఖ్యలు కొంత ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

కేసిఆర్ బలాలు బలహీనతలు తనకు బాగా తెలుసని, వచ్చే ఎన్నికల్లో బిఆర్‌ఎస్ ను గద్దె దించేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తానని చెప్పుకొచ్చారు ఈటెల.ముఖ్యంగా బిఆర్‌ఎస్ నుంచి చాలమంది నేతలను బీజేపీలోకి ఆహ్వానించేందుకు ఈటెల గట్టిగానే ప్రయత్నిస్తున్నారు.కానీ ఇప్పటివరకు ఎలాంటి చేరికలు జరగలేదు.
అయితే గతంలో పదవి విషయంలో అసంతృప్తిగా ఉన్న ఈటెల.ఇప్పుడు సరైన పదవి లభించడంలో దూకుడు గా వ్యవహరించే అవకాశం ఉంది.
అంతే కాకుండా ఎన్నికలవేళ బీజేపీకి మైలేజ్ తెచ్చేందుకు పక్కా ప్రణాళికలతో ఈటెల ముందుకు సాగుతాడనడంలో ఎలాంటి సందేహం లేదు.మరి బీజేపీని అధికారంలోకి తేవడమే టార్గెట్ గా ఉన్న ఈటెల కేసిఆర్ (Etela Kcr)వ్యూహాలను ఎలా తిప్పికొడతాడో చూడాలి.







