భద్రతా మండలిలో భారత్‎కు శాశ్వత సభ్యత్వం దొరికేనా?

అందరూ ఊహించినట్లుగానే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్ కు శాశ్వత సభ్యత్వం పై రష్యా తన వైఖరిని తేట తెల్లం చేసింది.అన్ని అర్హతలు ఉన్నా భారత్ ను శ్వాశ త సభ్య దేశంగా ఎందుకు చేర్చుకోవడం లేదో అర్దం కాని ప్రశ్న?.తరచి చూస్తే ప్రస్తుతం వున్న ఐదు శాశ్వత సభ్య దేశాలకు ‘ వీటొ ‘ అధికారం వుంది.ఈ వీటొ అధికారం వల్లే భారత్ కు శాశ్వత సభ్యత్వం రాకుండా వుంది.

 Will India Get Permanent Membership In The Security Council, United Nations , S-TeluguStop.com

ఇప్పటికే రష్యా,ఫ్రాన్స్,అమెరికా,బ్రిటన్ చూచాయిగ మద్దతు తెలిపిన,రష్యా మాత్రం బాహాటంగా భద్రతా మండలిలో భారత్ చేరిక యెంతగానో అవసరమని వక్కాణించింది.చైనా మాత్రం యే ప్రతిపాదన చేయలేదు.

భద్రతా మండలిలో భారత్ రాకపోవడానికి కారణం చైనా యే.చైనా యే పెద్ద అవరోధంగా వుంది.ఒకవేళ మిగతా దేశాలు ఒత్తిడి తెస్తే పాక్ రహస్యంగా చైనాకు వద్దని వర్తమానం పంపుతుంది.ప్రస్తుతం ఇదే జరుగుతోంది.

ఇప్పుడు చైనా, పాక్ రెండింటి స్నేహం అలా ఉంది.ఇప్పటికే దక్షిణ ఆసియాలో బలమైన భారత్, ఇక భద్రతా మండలిలో శాశ్వత స్థానం ఇస్తే అది పాక్ ఎంత మాత్రం సహించదు.

ఇస్తే పాక్ కు నష్టమే.ఇంత కాలం అడ్డు రావడానికి ఒకింత పాక్ కూడా ఇందులో ప్రమేయం ఉంది.

అమెరికా ,భారత్ కు దగ్గరయ్యే కొద్ది అటు చైనా,ఇటు పాక్ కలవర పడుతున్నాయి.భద్రతా మండలిలో ఒక వేళ భారత్ కు శాశ్వత సభ్యత్వం ఇస్తే చైనా తనకు ఉన్న ‘వీటో ‘ అధికారంతో వ్యతిరేకంగా ఓటు వేస్తుంది.

అప్పుడు భారత్ చేరిక క్లిష్టమవుతుంది.కనుక ముందు శాశ్వత సభ్య దేశాలకు ఉన్న వీటో అధికారం రద్దు చేయాలి.

ఈ వీటో అధికారం తోనే భారత్ చేరిక ఆలస్యం అవుతోంది.దీనికి తోడు దేశాల రాజకీయాలు.

ఐక్యరాజ్య సమితి లోని భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాలుగా ఉన్న అమెరికా,బ్రిటన్, చైనా ఫ్రాన్స్,రష్యా ఈ దేశాలు ఎప్పుడు అధికారికంగా ముఖా ముఖిగా ఒక చోట కలుసుకున్నది లేదు.ఆరవ దేశంగా విశ్వంలోని ఏ దేశంనైనా చేర్చుకోవాలనే తలంపు కూడా వచ్చినట్లు లేదు.

ఆరో దేశంగా చేరాలంటే వరుసగా ఇండియా, దక్షిణ ఆఫ్రికా, బ్రెజిల్, జర్మనీ మొదలగు దేశాలు ఉన్నాయి.ఈ కోవలో మరికొన్ని దేశాలు కూడా భద్రతా మండలి లో శాశ్వత సభ్య దేశాలుగా చేరాలని ఉవ్విళూరుతున్నాయి.

ఏ దేశం చేరిన,చేరాలి అనుకున్న చైనా మాత్రం అసలు ఒప్పుకోదు.దీనికి కారణం వీటో అధికారమే.

ఈ వీటో అధికారాన్ని ప్రక్షాళన చేయాలంటే అమెరికా కూడా ఇష్ట పడదు.ఐక్యరాజ్య సమితి లో పెత్తనం అంతా అగ్ర రాజ్యందే.

Telugu America, Brazil, Britain, China, Germany, India, Pakistan, Russia, Africa

రష్యా,ఫ్రాన్స్, బ్రిటన్ లు భారత్ చేరికకు సానుకూలంగా ఉన్న సైంధవుడిలా చైనా అడ్డు పడుతోంది.భారత్ చేరితే ఆసియా ఖండం లో తన ప్రాభవం తగ్గుతుంది, గండి పడుతుందని చైనా ఊహించింది.6 వ దేశముగా ఏ దేశమైన భద్రతా మండలిలో శాశ్వత హోదా పొందాలి అంటే ప్రస్తుతం ఉన్న ఐదు దేశాలు ఒప్పుకొని తీరాలి.ఏ దేశమైన ఒప్పుకొని యెడల అది అమలు కాదు.

ఇదే వీటో అధికారం యొక్క ప్రత్యేక త.సాధారణంగా అన్ని దేశాలు స్నేహం,పరస్పర సహకారం, శాంతి అని పలు శిఖరాగ్ర సదస్సుల లో మాట్లాడుకుంటాయి.కాని అదంతా ఆ చర్చ వరకే.ఇక స్నేహ,సహకారానికి తావెక్కడ?,సహకారం అయితే ఉండొచ్చు కాని స్నేహం అనే పదం పేపర్ల వరకే.స్నేహం అంటే పొరుగున ఉన్న దేశాలు,మిగతా దేశాల పట్ల కూడా దృఢమైన బంధం కలిగి ఉండుట.ఇక్కడ భారత్ అన్ని దేశాలతో స్నేహం వాంఛిస్తుంది.

అసలు విశ్వంలోనే శాంతి కాముక దేశం ఏదంటే భారత దేశమే ఇందులో సందేహం లేదు.అదే పాకిస్థాన్ కు నచ్చదు.

అంతర్గతంగా అది రాజకీయం చేస్తోంది.చైనాకు మద్దతు పలుకుతోంది.

ఇక ఐరో ఖండంలో ఉన్న ఫ్రాన్స్ భారత్ కు మద్దతు ఇచ్చినా, అమెరికా,బ్రిటన్, రష్యాలు భారత్ కు అనుకూలంగా ఉన్న చైనా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో భారత్ కు అనుకూలంగా లేదనేది జగమెరిగిన నగ్న సత్యం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube