ఎన్నికలు దగ్గరికి వచ్చే కొద్దీ ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిణామాలు అనేక మలుపులు తీసుకుంటున్నాయి .నిన్న మొన్నటి వరకూ పోత్తులు లేకపోతే అధికార వైసీపీ ( YCP party )ని ఓడించడం అసాధ్యమని నమ్మిన తెలుగుదేశం వ్యూహకర్తల ఆలోచనల్లో మార్పులు వస్తున్నట్లుగా తెలుస్తుంది క్రమంగా తెలుగుదేశం బలపడుతున్న సూచనలు కనపడటం , పార్టీ పెద్దలను కూడా ఆలోచనలో పడవేస్తున్నట్లుగా తెలుస్తుంది.
మొదటినుంచి తెలుగు దేశానికి ఆర్థిక మద్దతుతో పాటు అనేక విధాలుగా అండగా నిలబడుతున్న ఒక సామాజిక వర్గపు లాభీయిస్టు లు కూడా ఆంధ్రప్రదేశ్లో గాలి తెలుగు దేశానికి అనుకూలంగా మారుతూ ఉన్నందున పొత్తుల పేరుతో సీట్లు వృధా చేసుకోవద్దని తెలుగుదేశం( Telugu Desam Party ) అధినేతపై ఒత్తిడితీసుకొస్తున్నట్టుగా తెలుస్తుంది.

అంతేకాకుండా ఇటీవల విడుదలవుతున్న సర్వే రిపోర్టులు కూడా తెలుగుదేశానికి అనుకూలంగా మారుతూ ఉండడంతో ఎట్టి పరిస్థితి లలోనూ పొత్తులపై ఉదారంగా ఉండకూడదు అన్న ఆలోచనలో ఈ వర్గాలు ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి .అయితే అనేకసంక్షేమ పధకాలతో బలమైన ఓటు బ్యాంకును నిర్మించుకున్న అధికార పార్టీ ని ఓడించాలంటే పొత్తులు అనివార్యమని కూడా తెలుగుదేశంలోని మరి కొన్ని వర్గాలు వాదిస్తున్నట్లుగా తెలుస్తుంది.ఇలా రోజురోజుకు మారుతున్న పరిస్థితుల నడుమఅంతిమంగా తెలుగుదేశం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా అన్నది ప్రస్తుతానికి అంతుపట్టని విధం గా మారింది .

నిజానికి తెలుగుదేశానికి ఈ ఎన్నికలు డూ ఆర్ డై అనే చెప్పాలి ఎందుకంటే మరోసారి ఎన్నికలలో ఓడిపోతే ఈసారి నాయకత్వం మార్పు కూడా ఉంటుంది ఎందుకంటే చంద్రబాబుకు( Chandrababu Naidu ) వయో భారం మీద పడుతున్నందున లోకేష్ ( Nara Lokesh )నాయకత్వంలో మరొకసారి ఎన్నికలకు వెళ్ళటం పార్టీకి కత్తి మీద సాము అనే చెప్పాలి, ఎందుకంటే లోకేష్ కన్నా సీనియర్ నాయకులు తెలుగు దేశం లో చాలామంది ఉండటం వల్ల వారు లోకేష్ నాయకత్వాన్ని ఎంత మేరకు ఒప్పుకుంటారు అన్నది కూడా ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది.దాంతో తెలుగుదేశంసంస్థా గతంగా అనేక మార్పులకు గురయ్యే అవకాశం కూడా ఉంటుంది .అందువల్ల ఇప్పుడే ఎన్నికల్లో గెలిస్తే లోకేష్ కి అవసరమైన రోడ్డు మ్యాప్ నిర్మించడానికి అవకాశం గా ఉంటుందని చంద్రబాబు ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తుంది
.






