తెలంగాణ ఎన్నికల వేళ బీజేపీ( BJP ) వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందా ? అందులో భాగంగానే కుల ప్రాతిపధికన ప్రణాళికలు రచిస్తున్నారా ? నిన్న బీసీలు నేడు ఎస్సీలు.ఇంతకీ బీజేపీ ఎజెండా ఏంటి ? ఇలాంటి ప్రశ్నలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి.ప్రస్తుతం రాష్ట్రంలో ఇతర పార్టీలతో పోల్చితే బీజేపీ కొంత వెనుకంజలోనే ఉంది.ఈ నేపథ్యంలో ఎన్నికల్లో బీజేపీ బలంగా సత్తా చాటడం అంతా తేలికైన విషయం కాదు.
అసలే కర్నాటక ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన తరువాత తెలంగాణలో( Telangana ) తప్పక సత్తా చాటల్సిన పరిస్థితి.కానీ పార్టీలో ఇక్కడి పరిణామాలు మాత్రం పూర్తి భిన్నంగా ఉన్నాయి.
అందుకే కుల ప్రాతిపదికన ఓటర్లను ఆకర్షిస్తే తిరుగుండదనే ఆలోచనలో కమలనాథులు ఉన్నట్లు తెలుస్తోంది.

అందుకే తెలంగాణలో అత్యంత ప్రభావం చూపే బీసీ, ఎస్సీ ఓటర్లను ఆకర్శించేందుకు ప్లాన్ చేస్తున్నారు బీజేపీ పెద్దలు.ఇప్పటికే బీసీల నుంచే సిఎం అభ్యర్థిని ఎన్నుకుంటామని చెప్పిన బీజేపీ నేతలు.తాజాగా ఎస్సీ ఓటర్లను కూడా తమవైపు తుప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు.
అందులో భాగంగానే నిన్న జరిగిన ఎస్సీ బహిరంగ సభలో దశాబ్దాలుగా నాలుగు తున్న ఎస్సీ వర్గీకరణపై కమిటీ వేస్తామని ప్రధాని మోడీ( Prime Minister Modi ) వ్యాఖ్యానించడం రాజకీయ చర్చకు దారి తీస్తోంది.ఎన్నో ఏళ్లుగా ఎస్సీ వర్గీకరణపై మాదిగలు పోరాటం చేస్తూనే ఉన్నారు.
సున్నితమైన అంశం కావడంతో ఈ వర్గీకరణ విషయంలో ప్రభుత్వాలు ఆచితూచి అడుగులు వేస్తూ వచ్చాయి.

అయితే ఇన్నేళ్లు ఈ విషయంపై సైలెంట్ గా ఉన్న ప్రధాని మోడీ సరిగ్గా ఎన్నికల ముందు ఎస్సీ వర్గీకరణపై కమిటీ వేస్తామని చెప్పడం కొత్త సందేహాలకు తావిచ్చే అంశమే.ఎందుకంటే కేవలం ఓటర్లను ఆకర్శించేందుకే మోడీ ఈ తరహా వ్యాఖ్యాలు చేశారా ? లేదా నిజంగానే ఆ దిశగా అడుగులు వేస్తారా ? అనే ప్రశ్నలు వ్యక్తమౌతున్నాయి.ఈ నెల 30 నాటికి తెలంగాణ ఎన్నికలు( Telangana elections ) పూర్తి కాబోతున్నాయి.
డిసెంబర్ 3 న ప్రభుత్వం ఎవరిదనే అంశం తేలిపోనుంది.ఆ తరువాత ఇచ్చిన హామీలు అట్టకెక్కిన ఆశ్చర్యం లేదనేది కొందరు అతివాదులు చెబుతున్నా మాట.మొత్తానికి రాష్ట్రంలో బిఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల మద్య బలమైన పోటీ ఉన్న నేపథ్యంలో బీజేపీ హవా తగ్గకుండా కుల వ్యూహానికి కమలనాథులు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది.మరి ఈ వ్యూహం కాషాయ పార్టీకి ఎంతవరకు కలిసొస్తుందో చూడాలి.