టాలీవుడ్‌లో పౌరాణికం నుండి సాంఘికం వరకు ఎలాంటి సినిమాల్లో నటించాలన్నా ముందుండే హీరోలు ఎవరంటే ఠక్కున నందమూరి హీరోల పేర్లు వినిపిస్తాయి.అలాంటి ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు ఈ ఫ్యామిలీ హీరోలు.
అయితే అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ ఓ పాత్ర చేయాలని తీవ్రంగా ప్రయత్నించినా అది కుదర్లేదు.దాంతో ఆ పాత్రను తన కొడుకు బాలకృష్ణతో చేయించుకోవాలని దర్శకనిర్మాతలకు సూచించారట ఎన్టీఆర్.
జెంగీస్ ఖాన్… మంగోలియా రాజ్యాన్ని ఏర్పాటు చేసిన అతడు, చరిత్రలో అత్యంత క్రూరమైన రాజుగా మిగిలిపోయిన సంగతి చాలా తక్కువ మందికి తెలుసు.అలాంటి జెంగీస్ ఖాన్ జీవితకథ ఆధారంగా అప్పట్లో కాకర్ల కృష్ణ అనే నిర్మాత సినిమా చేయాలని ప్రయత్నించాడు.
అయితే దర్శకుడిగా దాసరి నారాయణరావును ఎంపిక చేసిన ఆయన ఎన్టీఆర్ సూచన మేరకు బాలయ్యను హీరోగా తీసుకోవాలని చూశాడు.కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు.
దీంతో ఆ సినిమా ప్రయత్నం కూడా చరిత్రగానే మిగిలిపోయింది.కానీ బాలయ్య చాలా సందర్భాల్లో తన తండ్రి ఎన్టీఆర్ చేయాలనుకున్న పాత్రలు తాను ఎప్పటికైనా చేస్తానని చెప్పుకొచ్చాడు.
మరి ఈ క్రమంలో జెంగీస్ ఖాన్ లాంటి నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రను బాలయ్య ఈ కాలంలో చేయగలడా.ఒకవేళ చేసినా ఇప్పటితరం ఆడియెన్స్ బాలయ్యను అలాంటి పాత్రలో యాక్సెప్ట్ చేస్తారా అనేది పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది.
మరి బాలయ్యను జెంగీస్ ఖాన్ లాంటి పాత్ర చేయాలని ఏ డైరెక్టర్ అయినా ధైర్యం చేసి అడగతారేమో చూద్దాం.ఏదేమైనా బాలయ్య లాంటి యాక్టర్ అలాంటి పాత్ర చేస్తే వెండితెరపై ఆ పాత్ర ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి.
ఇక ప్రస్తుతం బాలయ్య అఖండ చిత్రాన్ని రిలీజ్‌కు రెడీ చేసిన సంగతి తెలిసిందే.ఈ సినిమాను బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్నాడు.







