వైసీపీకి నో యూస్.. ?

ఏపీలో ఎన్నికలకు ఇంకా చాలా టైమ్ ఉన్న సంగతి తెలిసిందే.అయినప్పటికి రాష్ట్రంలో పోలిటికల్ హీట్ గట్టిగానే సాగుతోంది.

 Will All Ycps Efforts Fail, Ys Jagan Mohan Reddy , Ycp Bus Yatra , Ap Politics-TeluguStop.com

ముఖ్యంగా అధికార వైసీపీ ఇప్పటినుంచే చేస్తున్న ప్రచారాలు తరచూ వార్తల్లో నిలుస్తున్నాయి.వచ్చే ఎన్నికల్లో 175 స్థానలో కూడా విజయం సాధించాలని టార్గెట్ పెట్టుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి( YS Jagan Mohan Reddy ).ఇప్పటినుంచే ప్రజల్లో ఉంటేనే ఆ స్థాయి విజయం లభిస్తుందని భావించి పార్టీ నేతలను నిత్యం ప్రజల్లో ఉంచే ప్రయత్నం చేస్తున్నారు.ఇప్పటికే గడప గడపకు మన ప్రభుత్వం, మా తోడు నువ్వే జగన్, వై ఏపీ నీడ్స్ జగన్.

ఇలా ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తు పార్టీ నేతలు నిత్యం ప్రజల్లో ఉండేలా చూస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి.

Telugu Ap, Jana Sena, Ap Jagan, Ycp Bus Yatra, Ysjagan-Politics

ఇక ఇప్పటికే ప్రచార పర్వంలో సామాజిక సాధికార యాత్ర పేరుతో బస్సు యాత్ర( YCP Bus Yatra ) కూడా చేస్తున్న సంగతి తెలిసిందే.అయితే వై నాట్ 175 టార్గెట్ గా చేస్తున్న కార్యక్రమాలన్నీ వైసీపీకి పెద్దగా కలిసిరావడం లేదు.వ్యూహాత్మకంగా జగన్ ప్రవేశ పెడుతున్న ప్రతీకార్యక్రమానికి ప్రజామద్దతు కరువైంది.

రాష్ట్రంలో అన్నీ నియోజిక వర్గాలు టార్గెట్ గా వైసీపీ నేతలు చేస్తున్న బస్సు యాత్రకు ప్రజాకర్షణ లోపం స్పష్టంగా కనిపిస్తోంది.యాత్ర ప్రారంభమై 18 రోజులు అవుతున్న ఎక్కడ ఆశించిన స్థాయిలో జనం నీరాజనాలు లేవని ఆ పార్టీ నేతలే వాపోతున్న వాపోతున్న పరిస్థితి ఏర్పడింది.

Telugu Ap, Jana Sena, Ap Jagan, Ycp Bus Yatra, Ysjagan-Politics

ఇక వై ఏపీ నీడ్స్ జగన్( Why AP Needs Jagan )… మా తోడు నువ్వే జగన్ వంటి కార్యక్రమాలకు కూడా ప్రజలు విముఖత చూపిస్తున్నారట.దీంతో ప్రజాకర్షణ కోసం జగన్మోహన్ రెడ్డి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టిన నో యూస్ అంటున్నారు రాజకీయ వాదులు.ఎందుకంటే ప్రస్తుతం రాష్ట్రంలో జగన్ పాలనపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.చాలామంది జగన్ పాలనపై అపనమ్మకంగానే ఉన్నారు అందుకే వైసీపీని ప్రజలు పెద్దగా పట్టించుకోవడం లేదనేది కొందరి అభిప్రాయం.

అయితే ఏపీలో ఎన్నికలకు ఇంకా ఆర్నెళ్లు సమయం ఉండడంతో.ఈ కొద్ది రోజులను జగన్ పక్కా ప్రణాళికతో యూస్ చేసుకుంటే మేలని, ఏవేవో కార్యక్రమాలు పెట్టి ప్రజలను అసహనానికి గురి చేస్తే వైసీపీకి ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు రాజకీయవాదులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube