కేసీఆర్ ను వీళ్ళెవరు నమ్మడం లేదా ? అనుమానిస్తున్నారా ?

దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలనే ఆలోచనతో టీఆర్ఎస్ ను కాస్త బీఆర్ఎస్ గా( BRS ) మార్చి తెలంగాణ సీఎం కేసీఆర్( CM KCR ) సంచలనం సృష్టించారు.ముఖ్యంగా బిజెపిని అధికారంలోకి రాకుండా చేయడమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా విపక్ష పార్టీలు అన్నిటినీ ఏకం చేస్తూ అతిపెద్ద పార్టీగా అవతరించేందుకు కేసిఆర్ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.

 Why These Political Leaders Are Avoiding Cm Kcr Details, Brs, Telangana, Kcr, Br-TeluguStop.com

ఢిల్లీలోనూ టిఆర్ఎస్ ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు.ప్రస్తుతం తెలంగాణ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇక్కడ రాజకీయాలపై దృష్టి సారించారు.

దేశవ్యాప్తంగా పర్యటనలు చేపట్టి బిజెపికి వ్యతిరేకంగా ప్రచారం చేపట్టి,  అన్ని రాష్ట్రాల్లోనూ బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకం చేసి అధికారంలోకి వచ్చే విధంగా కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు.మొదట్లో వివిధ రాష్ట్రాల బిజెపియేతర ముఖ్యమంత్రు లను కేసీఆర్ కలిశారు.

అలాగే మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేశారు.

Telugu Kcr Natioanl, Mamatha Benarji, Nitheesh Kumar, Telangana, Telangana Bjp-P

పెద్ద ఎత్తున ఇతర రాష్ట్రాల్లోనూ బీ ఆర్ ఎస్ లోకి చేరికలు ఉండే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు.ఇది ఇలా ఉంటే మొదట్లో కెసిఆర్ పై నమ్మకంతో వివిధ రాష్ట్రాల్లోని బిజెపి వ్యతిరేక పార్టీలు బీఆర్ఎస్ కు దగ్గరయ్యేందుకు ప్రయత్నించినా, ప్రస్తుతం మాత్రం దూరంగానే ఉంటుండడం, పైగా కేసీఆర్ పై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉండడం వంటివి బిఆర్ఎస్ కు ఇబ్బందికరంగా మారాయి.దేశవ్యాప్తంగా విపక్ష పార్టీలన్నీటిని ఏకం చేసే విధంగా కేసీఆర్ ప్రయత్నాలు చేస్తుండగా,  మరోవైపు మమతా బెనర్జీ , నితీష్ కుమార్ వంటి వారు ఇదే పనుల్లో నిమగ్నమయ్యారు.

కాంగ్రెస్ తో పాటు, అనేక ప్రాంతీయ పార్టీల అధినేతలను కలుస్తూ 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందే విపక్ష పార్టీలన్నిటిని ఏకం చేసి,  బిజెపి ని ఎదుర్కోవాలి అనే విధంగా ప్లాన్ చేస్తున్నారు.

Telugu Kcr Natioanl, Mamatha Benarji, Nitheesh Kumar, Telangana, Telangana Bjp-P

మమతా బెనర్జీ , అరవింద్ కేజ్రీవాల్ తో పాటు బిజెపిని వ్యతిరేకించే రాజకీయ పార్టీల అధినేతలను నితీష్ కుమార్( Nitish Kumar ) కలుస్తున్నారు.కానీ బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కలవకపోవడం , ఎక్కడా బిఆర్ఎస్ ప్రస్తావన రాకపోవడంతో వీరంతా కేసీఆర్ ను దూరం పెట్టారా అనే అనుమానాలు కలుగుతున్నాయి.అసలు బిజెపి సూచనల మేరకు టిఆర్ఎస్ ను బీ ఆర్ ఎస్ గా మార్చి జాతి స్థాయిలో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చేందుకు కెసిఆర్ ను రంగంలోకి దించారా అనే అనుమానాలు బిజెపి వ్యతిరేక ప్రాంతీయ పార్టీల్లో కలగడంతోనే , కెసిఆర్ అంతగా పట్టించుకోవడంలేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube