క్రికెట్‌లో ఒక ఓవర్‌కు ఆరు బంతుల చరిత్ర గురించి మీకు తెలుసా?

అంతర్జాతీయ క్రికెట్‌లో 1979-80 నుండి సిక్స్-బాల్ స్టాండర్డ్ ఓవర్ ప్రాక్టీస్ ప్రపంచవ్యాప్తంగా ప్రారంభమయ్యింది.గతంలో ఐసిసి లాంటి రూల్ లేదా రూల్ మేకింగ్ బాడీ ఏమీ లేదు.కాబట్టి నాలుగు, ఐదు, ఎనిమిది బంతుల ఓవర్‌లు వేర్వేరు సమయాల్లో, వివిధ దేశాలలో ఉండేవి.1889 వరకు ఇంగ్లాండ్‌లో నాలుగు బంతుల ఓవర్ ఉండేది.ఆ తర్వాత ఐదు బంతుల ఓవర్ 1899 వరకు కొనసాగింది.దీని తర్వాత 1900లో ఆరు బంతుల ఓవర్ వచ్చింది.ప్రారంభ సంవత్సరాల్లో ఆస్ట్రేలియా కూడా నాలుగు బంతుల ఓవర్‌ ఉండేది.దీని తర్వాత ఇంగ్లండ్‌లో ఒక సిక్స్ బాల్ ఓవర్ ఉండేది.కానీ 1922-23 సీజన్ నుండి, ఆస్ట్రేలియా ఎనిమిది బంతుల ఓవర్ ఉంచాలని నిర్ణయించుకుంది.1939లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ కూడా తమ దేశవాళీ క్రికెట్‌లో రెండేళ్లపాటు ఎనిమిది బంతుల ఓవర్‌లను కొనసాగించాయి.

 Why There Are Only Six Balls In A Over In Cricket , Cricket , Six Balls In A Ove-TeluguStop.com

అదే సమయంలో రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది.మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత సాధారణ క్రికెట్ సీజన్ ఇంగ్లాండ్‌లో పునఃప్రారంభమైనప్పుడు, సిక్స్-బాల్ ఓవర్ తిరిగి వచ్చింది.

దక్షిణాఫ్రికా గురించి చెప్పాల్సవస్తే.దక్షిణాఫ్రికాలో 1938-39లో తిరిగి 1957-58లో ఎనిమిది బంతుల ఓవర్లు ఉండేవి.

అదేవిధంగా పాకిస్తాన్‌లో 1974-75, 1977-78లో ఎనిమిది బంతుల ఓవర్లు ఉండేవి.నాలుగు బంతుల ఓవర్ చాలా తక్కువగా ఉందని క్రికెట్ నిపుణులు భావించారు.

దాన్ని పెంచే ప్రయత్నంలో ఆ సంఖ్య ఎనిమిదికి చేరింది.కానీ 8 బంతలు చాలా ఎక్కువ అనిపించాయి.

దీంతో 8 లేదా 4 సరికాదని 6కు ఫిక్సయ్యారు.అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ 1909లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా ప్రతినిధులతో ఏర్పాటయ్యింది.అప్పట్లో దాని పేరు ఇంపీరియల్ క్రికెట్ కాన్ఫరెన్స్.ఇది 1965లో అంతర్జాతీయ క్రికెట్ కాన్ఫరెన్స్‌గా మారింది.ఆ తరువాత 1989లో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్‌గా రూపాంతరం చెందింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube