శాస్త్రవేత్తల్లో, పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేవారో మాత్రమే తెలివైన వారు అనుకోవడం మన పొరపాటు.కొందరు తమ బుర్రలకు పనిచెప్పి.
అగ్గిపెట్టెలను హెలికాఫ్టర్ గా తయారుచేయగలరు.మరికొందరు మనం రోజూ వాడే వస్తువులను ఉపయోగించి కొత్త కొత్త ప్రయోగాలు చేయగలరు.
దేశంలో ఇలా ఎంతోమంది తెలివిగా ఆలోచించి సోషల్ మీడియాలో వైరలవుతున్నారు.ఒక వ్యక్తి తన తెలివిని ఉపయోగించి ఎద్దుల బండిని.
కారుగా మార్చాడు.దీంతో ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.
ఈ వీడియో స్టార్టింగ్ లో మహిళలు కారులో కూర్చోవడం మనకు కనిపిస్తుంది.ఆ మహిళల వేషధారణ బట్టి వారు కారులో షికారుకు వెళ్తున్నారేమో అనిపిస్తుంది.కానీ వారు కూర్చున్న కారుని సరిగ్గా పరిశీలిస్తే ఎవరిఫైనా షాక్ అయ్యి తీరాల్సిందే.మొదట మహిళలు కారులో వెనుక సీటులో కూర్చున్నప్పుడు ఎంత అద్భుతంగా ఉంటుందో వీడియోలో చూడొచ్చు.
కానీ, కెమెరాను వెనుక వైపుకు కాక… ముందు వైపుకు తీసుకొచ్చినప్పుడు మనం ఇప్పటివరకు విలాసవంతమైనది అనుకున్న కారు. ఎద్దుల బండిగా మారిపోవడం మీరు చూడొచ్చు.
అయితే, తక్కవు డబ్బులతో ఎండ్ల బండిని కారులా మార్చేసిన ఆ వ్యక్తి తెలివికి సలాం కొట్టాల్సిందే.
ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా.
ఈ వీడియో ప్రజలను తెగ ఆకట్టుకుంటుంది.ఇప్పటి వరకు దాదాపు 5 వేల మంది ఈ వీడియోని లైక్ చేయగా.34-సెకన్ల క్లిప్‌ను చూసిన తర్వాత నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.‘దీనిని నిజమైన ఎద్దుల బండి అంటారు’ అని కొందరు నెటిజన్లు అంటుండగా.మరి కొందరు దీన్ని తయారుచేసిన వ్యక్తి మామూలోడు కాదు అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు.







