సాధారణంగా ఒక హీరో చేయాల్సిన సినిమా మరో హీరో చేయటం లాంటి చూస్తూ ఉంటాము ఇండస్ట్రీలో.అలాగే ముందుగా ఒక సినిమాలో హీరోయిన్ అనుకొని తర్వాత మరో హీరోయిన్ ని మార్చడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి.
ఈ క్రమంలోనే సినిమాల్లో ఇలాంటివి జరిగాయి అంటే.ఆ సినిమా విడుదలై సూపర్ హిట్ సాధించిన ఎన్నో ఏళ్ల తర్వాత విషయాలు బయటికి వస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే రజనీకాంత్ హీరోగా నటించిన నరసింహ సినిమా విషయంలో కూడా ఇలాంటిదే జరిగింది అని చెప్పాలి.
రజనీకాంత్ సినిమాలో అమాయకమైన ఒక పనిమనిషి పాత్రలో సౌందర్య నటిస్తే ఎంతో పొగరు ఉన్న అమ్మాయి నీలాంబరి పాత్రలో రమ్యకృష్ణ నటించింది.
అయితే ఈ సినిమాలో హీరోకి పాత్ర ఎంత పవర్ ఫుల్ ఉంటుందో అటు నిలంబరి పాత్ర కూడా అంతే పవర్ ఫుల్ వుంటుంది అనే విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే ఇక నీలాంబరి పాత్రలో రమ్యకృష్ణ ఒదిగిపోయి నటించింది.
ఒక్కసారిగా పాపులారిటీ సంపాదించింది అని చెప్పాలి.ఇక నీలాంబరి పాత్రలో రమ్యకృష్ణ తప్ప ఇంకెవరు నటించిన ఆ పాత్రకు న్యాయం చేసే వారు కాదేమో అని ప్రతి ఒక ప్రేక్షకుడు భావించాడు అని చెప్పాలి.
కానీ అలాంటి నీలాంబరి పాత్రను మాత్రం ముందుగా రమ్యకృష్ణ తో చేయాలని అనుకోలేదట.అమాయకమైన పనిమనిషి పాత్రలో నటించిన సౌందర్య తో నీలాంబరి పాత్ర చేయించాలని అనుకున్నారట.కానీ అప్పటికే సౌందర్యకు ఫ్యామిలీ ఇమేజ్ వుండడంతో ఇక ఆ పాత్ర చేస్తే నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుందని భావించి ఇక రజిని కాంత్ నీలాంబరి పాత్రను రమ్యకృష్ణ తో చేయించాలని అనుకున్నారట.అయితే ఈ విషయం తెలిసి అభిమానులు ఒక వేళ సౌందర్య ఆ పాత్ర చేసి ఉంటే సినిమా ఎలా ఉండేదో అని ఊహించుకుంటూ ఉండటం గమనార్హం.
రజిని కాంత్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వల్ల అప్పట్లో రజిని కాంత్ గురించి ఎంతో మంది నెగిటివ్ గా మాట్లాడుకోవడం ప్రచారం చేయడం కూడా మొదలుపెట్టారట.