హీరో రాజేంద్రప్రసాద్‌తో కాకుండా బాబు మోహన్‌తో సౌందర్య డ్యాన్స్.. ఎందుకో తెలుసా.. ?

‘మాయలోడు’ సినిమా( Mayalodu Movie ) సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.ఈ మూవీ తీస్తున్న సమయంలో నటుడు రాజేంద్రప్రసాద్‌, డైరెక్టర్‌ ఎస్‌.

వి.కృష్ణారెడ్డి "నేను గొప్ప అంటే నేనే గొప్ప" అనుకుంటూ గొడవపడ్డారు.

రాజేంద్రప్రసాద్( Rajendra Prasad ) కారణంగా ఆ మూవీ దర్శకనిర్మాతలు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు.ఒక్క సాంగ్ షూట్ తప్ప ‘మాయలోడు’ మూవీ షూటింగ్ కంప్లీట్ అయిన సమయంలో ఆ గొడవ జరిగింది.

కృష్ణారెడ్డిని( SV Krishna Reddy ) రాజేంద్రప్రసాద్‌ తక్కువ చేసి మాట్లాడటం వల్ల ఇద్దరి మధ్య చిన్నపాటి వాగ్వాదం జరిగింది."నీ డైరెక్షన్‌ వల్లే సినిమాలు హిట్‌ అవుతాయనుకోకు నా వల్లే సినిమాలు ఆడుతున్నాయి.

Advertisement

" అంటూ రాజేంద్రప్రసాద్ పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడట.అయితే ఇలా గొడవలు పడితే సినిమా పూర్తి కాదని కృష్ణారెడ్డి తగ్గారు.

ఒకరోజు రాజేంద్రప్రసాద్‌కి ఫోన్‌ చేసి ‘సౌందర్య( Soundarya ) డేట్స్‌ దొరికాయి.రిమైనింగ్ సాంగ్ ఒకటి పూర్తి చేద్దాం, సార్" అని అడిగారు.

కానీ రాజేంద్రప్రసాద్ సరైన రిప్లై ఇవ్వలేదు."డబ్బింగ్ చెప్పాలి.

పాట పూర్తి చేయాలి.నువ్వు అప్పుడే సినిమా రిలీజ్ కూడా షెడ్యూల్ చేసావ్.

కెనడా : యూనివర్సిటీ ఆఫ్ కాల్గరీ సెనేట్‌కు నామినేట్ అయిన భారత సంతతి వ్యక్తి
టాలీవుడ్ లో రాబోతున్న త్రీక్వెల్ సినిమాస్ ఇవే..?!

" అంటూ వెటకారంగా మాట్లాడాడు."డబ్బింగ్‌కి ఒక్కరోజు మాత్రమే టైమ్ ఇస్తా, అది కూడా 9-1, ఆపై 2-3" అని ఈ హీరో తెలిపాడట.

Advertisement

ఒక్క రోజులో డబ్బింగ్ పూర్తయ్యే అవకాశమే లేదు కాబట్టి నీ సినిమా అనుకున్న టైమ్‌కి రిలీజ్ కాద"ని అంటూ కృష్ణారెడ్డికి ఆందోళన పుట్టించాడట.

సింగల్ డేలో డబ్బింగ్ కష్టమని కృష్ణారెడ్డి ఆలోచిస్తూ చివరికి ఒక మంచి ఐడియాకి వచ్చారు.ఎడిటర్‌తో సెపరేట్ పీసెస్‌గా ఉన్న 1200 అడుగుల సినిమాని ఒకే రీల్‌గా ఎడిట్‌ చేయించేశారు.దానివల్ల నెక్స్ట్ డే 9:00 నుంచి ఒకటింటిలోపే డబ్బింగ్ చెప్పడం పూర్తయింది.డబ్బింగ్ అప్పుడే అయిపోవడంతో రాజేంద్రప్రసాద్ ఆశ్చర్యపోయాడు.

ఆ తర్వాత ఇంకొక సాంగ్ ఉంది కదా అది ఎలా పూర్తి చేస్తావో చూద్దామంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.ఒక్క సౌందర్యతోనే సాంగ్ కంప్లీట్ చేసుకోమ్మంటూ వ్యంగ్యంగా కూడా మాట్లాడాడు.

అప్పుడే కృష్ణారెడ్డికి మరో అదిరిపోయే ఐడియా వచ్చింది.బాబు మోహన్ ను( Babu Mohan ) ఈ పాటలో యాక్ట్ చేయించాలని భావించారు.అందుకు ఈ కమెడియన్ ఒప్పుకున్నారు.

సౌందర్య కూడా కృష్ణారెడ్డి మాట తీసేలేకపోయారు.ఈ విషయం తెలిసి రాజేంద్రప్రసాద్ వెంటనే తానే ఆ పాటలో చేస్తానని మేనేజర్ ద్వారా చెప్పించాడు కానీ కృష్ణారెడ్డి తాను ఒకరికి మాట ఇస్తే ఆ మాట తప్పను అని చెబుతూ బాబు మోహన్ తోనే ఆ పాట షూట్ చేయించారు.

ఆ పాటే ‘చినుకు చినుకు అందెలతో.’ ఈ సాంగ్ సూపర్ హిట్ అయింది.

బాబు మోహన్, సౌందర్యల డ్యూయెట్ సాంగ్ వెనుక ఉన్న కథ అదన్నమాట!.

తాజా వార్తలు