ఆ బాలీవుడ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ లతా మంగేష్కర్‌తో ఒక్క పాట కూడా పాడించలేదట?

లతా మంగేష్కర్‌( Latha Mangeshkar ).పరిచయం అక్కర్లేని ఓ గాన కోకిల.

ఆమెతో పాటలు పండించాలని నిర్మాతలు, దర్శకులు, సంగీత కళాకారులు ఆమె ఇంటి ముందు క్యూలు కట్టేవారు.అయితే అలాంటిది ఆమెని ఓ సంగీత దర్శకుడు మాత్రం పెడచెవిన పెట్టాడు అంటే మీరు నమ్ముతారా? నిజం.బాలీవుడ్‌లోని అప్పటి టాప్‌ మ్యూజిక్‌ డైరెక్టర్స్‌ లిస్టు చూస్తే శంకర్‌ జైకిషన్‌, ఎస్‌.

డి.బర్మన్‌, ఖయ్యాం, ఆర్‌.డి.బర్మన్‌, రవీంద్రజైన్‌లతోపాటు ఒ.పి.నయ్యర్‌ పేరు కూడా ప్రధమంగా వినిపిస్తుంది.ఈ మ్యూజిక్‌ డైరెక్టర్స్‌ అందరూ లతమ్మతో పాటలు పాడించుకున్నవారే.

ఒ.పి.నయ్యర్‌ తప్ప.అవును.

Advertisement

భారతదేశం గర్వించదగిన సింగర్‌, భారతరత్న, దాదా సాహెఫాల్కే అవార్డు, పద్మభూషణ్‌.అయినటువంటి లతమ్మతో ఆయన ఒక్కటంటే ఒక్క పాట కూడా పాడించలేదు.

లాహోర్‌లోని ఓ రేడియో స్టేషన్‌లో సింగర్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసిన ఒ.పి.నయ్యర్‌ ( Omkar Prasad Nayyar )ఆ తర్వాత ముంబై చేరుకొని సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించేవారు.ఈ క్రమంలో 1952లో వచ్చిన ‘ఆస్మాన్‌’ చిత్రం ద్వారా బాలీవుడ్‌లో సంగీత దర్శకుడుగా పరిచయమయ్యారు.

ఆయన అప్పటి వరకు ఉన్న సంగీత దర్శకుల సంగీతానికి భిన్నంగా స్వరాలను సమకూర్చడం, ఆర్కెస్ట్రాను కూడా విభిన్నంగా కండక్ట్‌ చేయడం వలన అనతి కాలంలోనే ఆయనకి సంగీత దర్శకుడిగా మంచి పేరు వచ్చింది.ఈ నేపథ్యంలోనే రిథమ్‌ కింగ్‌ అనే బిరుదును సంపాదించుకున్నారు.1956లో వచ్చిన ‘సిఐడి’ చిత్రంలోని పాటలు ఎంత పెద్ద హిట్‌ అయ్యాయో అందరికీ తెలిసినదే.

ఒ.పి.నయ్యర్‌ చేసిన పాటల్లో పెద్ద విజయం సాధించిన పాటలు అనేకం.‘పుకార్‌తా ఛలా హూ మై’, ‘ఓ లేకే పహలా పహలా ప్యార్‌’, ‘బాబూజీ ధీరే ఛల్‌నా’, ‘దీవాన హువా బాదల్‌’, ‘మై ప్యార్‌ కా రాహీ హూ’, వంటి పాటలు మచ్చు తునకలు మాత్రమే.

ఆ ఒక్క సినిమా నా జీవితాన్నే మార్చేసింది... రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
రవితేజ కి రెమ్యూనరేషన్ ఎక్కువగా ఇస్తే కథ కూడా వినకుండా సినిమా చేసేస్తాడా..?

ఆయన సంగీత దర్శకత్వంలో అప్పటి టాప్‌ సింగర్స్‌ అందరూ పాడారు.కానీ, లతా మంగేష్కర్‌తో ఒక్క పాట కూడా పాడించకపోవడం గమనార్హం.అక్కడే కాదండోయ్.

Advertisement

మన దక్షిణ భారతదేశంలోని సినిమా సంగీతంపై ఒ.పి.నయ్యర్‌ ప్రభావం బాగా ఉండేది.‘ఏ దివిలో విరిసిన పారిజాతమో’ నయ్యర్‌ ప్రభావంతో చేసిన పాటే.

టాలీవుడ్ సంగీతదర్శకులైన ఎం.ఎస్‌.విశ్వనాథన్‌, ఇళయరాజా, సత్యం, మణిశర్మ వంటి సంగీత దర్శకులు కూడా నయ్యర్‌ ప్రభావంతో పాటలు చేసేవారట.

ఇక ఒ.పి.నయ్యర్‌ తెలుగులో చేసిన ఒకే ఒక సినిమా ‘నీరాజనం( Neerajanam )’.ఈ సినిమాలోని పాటలన్నీ సూపర్‌హిట్‌ అయ్యాయి.దీనికి ఉత్తమ సంగీత దర్శకుడుగా ఆయన నంది పురస్కారాన్ని కూడా అందుకున్నారు నయ్యర్‌.

భారతదేశంలో మహ్మద్‌ రఫీ తర్వాత అంతటి గొప్ప గాయకుడు ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం అని ఒ.పి.నయ్యర్‌ ప్రశంసించడం అప్పట్లో ఎంతో విశేషంగా చెప్పుకున్నారు.అలాంటి ఆయన లతమ్మతో ఎందుకు పాటలు పాడించలేదో ఇప్పటికీ ఓ మిస్టరీగానే మిగిలిపోయింది.

తాజా వార్తలు