చిరు వద్దు అని చెప్పిన రామ్ చరణ్ చేసి ఫ్లాప్ మూటగట్టుకున్న సినిమా ఏంటో తెలుసా ?

చిరంజీవి… సాదాసీదాగా మొదలైన చిరంజీవి కెరియర్ ఈరోజు మెగాస్టార్ లెవెల్లో కొనసాగుతుంది అంటే దాని వెనక ఆయన కష్టం, పట్టుదల, శ్రమ ఎంత ఉందో అంతకన్నా ఎక్కువగా సరైన పాత్రలను ఎంచుకోవడం కూడా ఉంది.అయన బాడీ లాంగ్వేజ్ కి ఎలాంటి పాత్రలు అయితే సరిగ్గా సూట్ అవుతాయో చూసుకొని మరి అలాంటి పాత్రలని ఎంచుకొని ఎన్నో హిట్టు సినిమాలను, బ్లాక్ బాస్టర్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటూ 150కి పైకా సినిమాల్లో నటిస్తూ ఇంకా సినిమా కెరియర్ ను కొనసాగిస్తూ వస్తున్నారు మన చిరంజీవి.

 Why Ram Charan Did A Film When Chiru Said No, Ram Charan, Chiru, Chiranjeevi,mag-TeluguStop.com

చిరంజీవి ని ఎంతోమంది హీరోలు ఇన్స్పిరేషన్ గా తీసుకుని సినిమాలోకి వస్తూ ఉంటారు.అంతేకాదు సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది ఆయన సలహాలు సూచనలు పాటిస్తూ ఉంటారు.

అలాంటి చిరంజీవి తన సొంత కొడుకు విషయంలో అలా జరగలేదట.చిరంజీవి వద్దు అని చెప్పిన సినిమాలో రామ్ చరణ్ నటించడంతో ఆ సినిమా ఫ్లాపై బొక్క బోర్లా పడ్డాడట.

మరి ఆ సంగతులు ఎంటో ఓసారి చూద్దాం.చిరుత సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు చిరంజీవి కొడుకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.ఆ సినిమా ఘన విజయం సాధించడంతో మగధీర వంటి ఒక ఇండస్ట్రీ హిట్స్ సైతం దక్కించుకోగలిగాడు.ఆ సినిమా రామ్ చరణ్ కెరీర్ ని కూడా మలుపు తిప్పిందని చెప్పాలి.

ఆ తర్వాత కొన్నాళ్లపాటు అడపాదడపా మంచి సినిమాల్లో నటించిన కూడా కొన్నాళ్లపాటు సరైన హిట్టు కావాలని రామ్ చరణ్ ఎదురు చూసిన సందర్భాలు ఉన్నాయి.వాస్తవానికి రాంచరణ్ కి సినిమా ఎంపికలో చిరంజీవి ఎల్లప్పుడూ సహాయం చేస్తూ ఉంటాడు.

Telugu Chiranjeevi, Chiru, Magadheera, Ram Charan, Toofan, Zanjeer-Movie

తుఫాను వంటి ఒక సినిమా నిర్ణయం సమయంలో చిరంజీవి ఆ కథ విన్న తర్వాత రామ్ చరణ్ కి ఎందుకో సూట్ కాదని భావించాడట.అదే సినిమాను జంజీర్ పేరుతో బాలీవుడ్ లో కూడా తీయడం జరిగింది.తనకు బాలీవుడ్ ఎంట్రీ దొరుకుతుందని రామ్ చరణ్ తాపత్రయపడ్డాడు కానీ చిరంజీవి వద్దని చెప్పాడట.ఇక హీరోయిన్ గా ప్రియాంక చోప్రా ను కూడా పెట్టుకోవడంతో ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలింది.

సినిమాలో కథ పెద్దగా జనాలకు రీచ్ కాకపోవడంతో అట్టర్ ఫ్లాప్ గా మిగిలింది.

Telugu Chiranjeevi, Chiru, Magadheera, Ram Charan, Toofan, Zanjeer-Movie

అంతేకాదు రామ్ చరణ్ కెరియర్ లో ఒక చెత్త రికార్డుగా కూడా మూట కట్టుకుంది.బాలీవుడ్ లో కూడా మరోసారి రాంచరణ్ సినిమా తీయాలంటే భయపడే స్థాయికి ఈ చిత్రం రామ్ చరణ్ కి నిరాశను మిగిల్చింది.అలా చిరంజీవి వద్దు అని చెప్పిన సినిమాతో రామ్ చరణ్ నటించిన బొక్క బోర్లా పడ్డాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube