బుల్లితెర యాంకర్ గా సుమకు పోటీనిచ్చే మరో యాంకర్ ఉన్నారా అనే ప్రశ్నకు ఎక్కువమంది లేరనే సమాధానం ఇస్తారు.ఈ మధ్య కాలంలో సుమ హోస్ట్ గా వ్యవహరించే షోల సంఖ్య తగ్గింది.
తాజాగా స్టార్ మా పరివార్ అవార్డ్స్ ప్రోమో రిలీజ్ కాగా ఈ ప్రోమో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.సీరియల్ సెలబ్రిటీలకు అవార్డులు ఇచ్చే ఈ కార్యక్రమానికి సినిమా రంగానికి చెందిన ప్రముఖ సెలబ్రిటీలు హాజరయ్యారు.
ప్రోమోలో ఒక సీరియల్ నటుడికి ఉత్తమ భర్త అవార్డ్ ఇచ్చారు.ఇద్దరు పెళ్లాలు ఉండటం వల్ల ఈ నటుడికి ఈ అవార్డ్ ఇవ్వడం గమనార్హం.అయితే ఇలా అవార్డు ఇచ్చారని తెలిసి సుమ దీనిని ఆదర్శంగా తీసుకుని రాజీవ్ కనకాల మరో పెళ్లి చేసుకుంటే ఎవరిది బాధ్యత అని పరోక్షంగా ప్రశ్నిస్తూ సెటైర్లు వేశారు.టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున ఈ ప్రోమోకు మెయిన్ అట్రాక్షన్ గా నిలిచారు.
మురళీ మోహన్, ఓంకార్, హైపర్ ఆది, సుధీర్, పాయల్ రాజ్ పుత్ ప్రోమోలో మెరిసి సందడి చేశారు.

ఈ నెల 16వ తేదీన ఈ ఈవెంట్ స్టార్ మా ఛానల్ లో ప్రసారం కానుంది.సాయంత్రం 6 గంటలకు ప్రసారం కానున్న ఈ ఈవెంట్ ఏ రేంజ్ లో రేటింగ్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.హీరోయిన్ వర్ష బొల్లమ్మ మాట్లాడుతూ నాకు స్టార్ మాతో టూ కనెక్షన్స్ ఉన్నాయని ఒకటి నా నేమ్ లో మా అనే టాటూ ఉందని నా పేరులో బొల్లమ్మ అని ఉందని ఆమె అన్నారు.
హీరోయిన్ల డ్యాన్స్ స్టెప్పులు ప్రోమోకు హైలెట్ గా నిలిచాయి.

సుడిగాలి సుధీర్ నిన్ను కోరి సినిమాలోని అడిగా అడిగా పాట పాడగా 9 సంవత్సరాలు అడిగాడని అక్కడినుంచి ఇక్కడికి వచ్చేశాడని హైపర్ ఆది చెప్పుకొచ్చారు.ఆ తర్వాత సుమ లాస్ట్ ఇయర్ అమర్ దీప్ వచ్చాడని సింగిల్ గా వచ్చాడని ఈ సంవత్సరం తేజస్విని వచ్చిందని నెక్స్ట్ ఇయర్ పిల్లాజల్లతో రావాలని కామెంట్లు చేశారు







