అమెరికాలోని పర్డ్యూ యూనివర్సిటీ క్యాంపస్‌లో భారత సంతతికి చెందిన విద్యార్ధి దారుణహత్యకు గురైన వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే.ఇరుదేశాల్లోనూ తీవ్ర విషాదం నింపిన ఈ ఘటనపై భారత విదేశాంగ శాఖ రంగంలోకి దిగింది.
హత్యకు దారి తీసిన పరిస్ధితులపై స్థానిక అధికారులతో టచ్‌లో వున్నట్లు శుక్రవారం తెలిపింది.మృతుడిని 20 ఏళ్ల వరుణ్ మనీష్ చద్దాగా గుర్తించారు.
ఇతను పర్డ్యూ యూనివర్సిటీలో చదువుకుంటున్నాడు.హాస్టల్‌లో తోటి రూమ్‌మేట్ చేతిలో వరుణ్ హత్యకు గురైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
అతనిని దక్షిణ కొరియోలోని సియోల్‌కు చెందిన 22 ఏళ్ల జీ మిన్ షాగా గుర్తించినట్లు పర్డ్యూ పోలీస్ చీఫ్ లెస్లీ వైటే తెలిపారు.
తాను బ్లాక్‌మెయిల్‌కు గురైనట్లు అతను టిప్పెకానో కౌంటీ మేజిస్ట్రేట్ సారా వ్యాట్ ముందు ఇచ్చిన వాంగ్మూలంలో చెప్పినట్లు న్యూయార్క్ టైమ్స్ కథనాన్ని ప్రసారం చేసింది.
కానీ అతను ఇంకా ఏమైనా చెప్పాడా అన్న దానిపై మాత్రం పత్రిక వివరించలేదు.బాధితుడి కుటుంబానికి ఏమైనా చెప్పదలచుకుంటున్నారా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు షా బదులిచ్చాడు.
తనను క్షమించాలని నిందితుడు చెప్పినట్లుగా న్యూయార్క్ టైమ్స్ తెలిపింది.రూమ్‌లో దొరికిన కత్తి తనదేనని.
దానితోనే వరుణ్‌ను హత్య చేసినట్లు నిందితుడు షా చెప్పినట్లు న్యూయార్క్ పోస్ట్ తెలిపింది.

ఇకపోతే.పర్డ్యూలోని భారతీయ కమ్యూనిటీకి చెందిన పలువురు వరుణ్ అంత్యక్రియలకు సంబంధించిన ఖర్చుల కోసం గో ఫండ్ మీ పేజీ ద్వారా ఫండ్ రైజింగ్ కార్యక్రమాన్ని చేపట్టారు.వరుణ్ తాతయ్య నేమ్జీ 1964లో గుజరాత్‌లోని కచ్ జిల్లాలోని కుంద్రోడి నుంచి అమెరికాకు వలస వచ్చారు.
దాదాపు ఆరు దశాబ్ధాలుగా వీరి కుటుంబం ఇక్కడి నుంచే మనుగడ సాగిస్తోంది.గణాంకాల ప్రకారం.పర్డ్యూ యూనివర్సిటీలో జనవరి 2014 తర్వాత క్యాంపస్‌లో జరిగిన తొలి హత్య ఇదే.వరుణ్ మరో 10 రోజుల్లో తన 21వ పుట్టినరోజును జరుపుకోనున్నారు.కానీ ఇంతలోనే ఈ దారుణం జరిగింది.2020లో పార్క్ ట్యూడర్ హైస్కూల్ నుంచి ఇతను గ్రాడ్యుయేషన్ చేశాడు.అదే ఏడాది నేషనల్ మెరిట్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌లో సెమీఫైనలిస్ట్.







