ఎన్టీఆర్ బయోపిక్ లో మోక్షజ్ఞ ఎందుకు లేడు.? బాలకృష్ణ గారి పాత్ర ఎవరు చేస్తున్నారు.?

ఎన్టీఆర్ బయోపిక్ చిత్రానికి సంబంధించిన ప్రీ రీలీజ్ ఈవెంట్ ఇటీవల జరిగిన సంగతి అందరికి తెలిసిందే.

ఈ వేడుకకు టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి, సూపర్‌స్టార్ కృష్ణ, లోకేశ్వరి, దగ్గుబాటి పురందేశ్వరి, వెంకటేశ్వర్లు, మంచు మోహన్ బాబు, దర్శకధీరుడు రాఘవేంద్రరావు, కృష్ణం రాజు, పరుచూరి బ్రదర్స్, యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌, టి.

సుబ్బరామిరెడ్డి, జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్‌, తారకరత్న‌, కొరటాల శివ, సీనియర్ నరేశ్‌తో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.

అయితే ఈ చిత్రంలో బాలకృష్ణ గారి పాత్రలో ఎవరి నటిస్తున్నారు అనేది ఇప్పుడు సినీవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.ఒకప్పుడు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనేంత సస్పెన్స్ గా ఉంది ఈ ప్రశ్న.ఇది ఇలా ఉంటె.

ఈ సినిమాతో బాలయ్య తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తాడనుకుంటే అది జరగలేదని స్పష్టం అవుతోంది.ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రను బాలయ్య చేస్తున్నందున బాలయ్య పాత్రను మోక్షజ్ఞ చేస్తాడన్న ప్రచారం సాగింది.

Advertisement

అయితే తన చిన్ననాటి పాత్రను తన రెండో కూతురు కొడుకు అంటే తన మనవడే పోషించాడని బాలయ్య స్వయంగా ప్రకటించి, ట్విస్ట్ ఇచ్చారు.అయితే బాలయ్య పెద్దయ్యాక ఆపాత్రను ఎవరు చేశారన్నది సస్పెన్స్ గా ఉంది.

ఏదో ఓ పాత్ర ద్వారా మోక్షజ్ఞ ఎంట్రీ ఇప్పించి ఉంటే బాగుండేదని అభిమానులు అంటున్నారు.మరి సినిమా విడుదలైతేగాని ఆ ట్విస్ట్ మనకి అర్ధం కాదు.

Advertisement

తాజా వార్తలు