అభిమానానికి గౌరవం ఇదేనా పవన్ జి?

జనసేనను విపరీతం గా అభిమానించే వారిలో జనసేన మద్దత్తు దారు , లాయర్ కళ్యాణ్ దిలీప్ సుంకర( Kalyan Dileep Sunkara ) పేరు తెలియని వారు ఉండరు.ఎందుకంటే జనసేనకు( Janasena ) అనుకూలంగా అధికార పక్షాన్ని కానీ ప్రతిపక్షమైన తెలుగుదేశాన్ని కానీ ఎలాంటి అంశం పై నైనా తనదైన వాక్చాతుర్యంతో ప్రత్యర్థి పార్టీలను చీల్చి చెండాడే కళ్యాణ్ దిలీప్ సుంకర ను పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) తర్వాత ఆ స్థాయిలో జనసైనికులు అభిమానిస్తూ ఉంటారు అంటే అతిశయోక్తి కాదు .

 Why Kalyan Dileep Sunkara Having Less Importance In Janasena Party Details, Kaly-TeluguStop.com

అప్పుడప్పుడు అతని దూకుడు కొంత పార్టీకి ఇబ్బంది కలిగించినప్పటికీ పార్టీ కోసం అతను పెడుతున్న శ్రద్దను ను పడుతున్న కష్టాన్ని మాత్రం పార్టీ కచ్చితంగా గుర్తించి తీరాల్సిందే అన్నది జనసేన హార్డ్ కోర్ అభిమానుల మాట.తన కామనర్ లైబ్రరి యూట్యూబ్ చానెల్ ద్వారా జనసెన పై ఆయన చేసే వీడియో లకు లక్షల్లో వ్యూస్ వస్తుంటాయి.

అయితే జనసేన-కళ్యాణ్ దిలీప్ ల బంధం మాత్రం ఎప్పుడూ వన్-వే-లవ్ అన్నట్టుగానే ఉంటుందన్నది ఆయనను దగ్గరగా చూసిన వారు చెబుతారు.పార్టీని ఆయన ఎంత ఓన్ చేసుకుని బుజాలపై మోసినప్పటికి పార్టీకి సంబంధించిన గుర్తింపు వ్యవహారంలో మాత్రం ఒక అడుగు దూరంగానే ఆయనను నిలువరిస్తుంటారు.

నిన్న కాక మొన్న వచ్చిన జబర్దస్ట్ ఆది( Jabardast Aadi ) లాంటి వారికి ఇస్తున్న గుర్తింపు కూడా మొదటి రోజు నుండి పార్టీ కోసం పనిచేసే కళ్యాణ్ దిలీప్ కు ఇవ్వడం లేదన్నది ఆయన సన్నిహితుల ఆరోపణ .జనసేన కు రాష్ట్రవ్యాప్తంగా మద్దత్తు ఇచ్చే యువతకు అవసరమైన కంటెంట్ను, ప్రతిపక్షాల ఆరోపణల పై ఎలా స్పందించాలో ఒక మార్గాన్ని దిలీప్ సుంకర ఇస్తున్నాడంటే అతిశయోక్తి కాదు.

Telugu Library, Dileep Sunkara, Hyper Aadi, Jabardast Aadi, Janasena, Kalyandile

అలాంటిది అతి చిన్న విషయంలో న్యూట్రల్ వాయిస్ తో చేసిన ఒక వీడియో వల్ల తెలుగుదేశం( TDP ) మనోభావాలు దెబ్బతీసిందని తమకు అతిపెద్ద అస్త్రం లా ఉపయోగపడుతున్న కళ్యాణ్ దిలీప్ సుంకరను పార్టీ దూరం చేసుకునే ప్రయత్నాలలో ఉంది అన్నది వినిపిస్తున్న వార్తల సమాచారం పార్టీ మొదలైనప్పటి నుంచి బలంగా పార్టీ కోసం నిలబడుతున్న ఇలాంటి నాయకులను దూరం చేసుకోవడం జనసేన వ్యూహాత్మక తప్పిదం గానే మెజారిటీ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మరి ఇప్పటికైనా జనసేన అధినాయకత్వం తన తప్పును గుర్తించి సరిదిద్దుకుంటుందా లేదా అన్నది చూడాలి.

Telugu Library, Dileep Sunkara, Hyper Aadi, Jabardast Aadi, Janasena, Kalyandile

స్వతహాగా లాయర్ కూడా అయిన దిలీప్ తనుకు సొంతంగానే ఒక రాజకీయ ప్రయాణం ప్రారంభించే సత్తా ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ పై ఉన్న విపరీతమైన ఇష్టంతో ఇప్పటికీ జనసేన కార్యకర్తగానే ఉండటానికి ఇష్టపడతారు మరి అలాంటి నిజాయితీగల కార్యకర్తలను వదులుకుంటే పార్టీ అనుకున్న లక్ష్యాలను సాధించడం కష్టమే అంటూ సోషల్ మీడియా వేదికగా అనేకమంది కామెంట్ చేస్తున్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube