కుర్ర హీరోల్లో శర్వానంద్ ఒక్కడే ఎందుకు వెనకపడిపోతున్నాడు...

సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న హీరోల్లో పెద్ద హీరో లని మినహాయిస్తే ఉన్న కొద్దిపాటి కుర్ర హీరోల్లో చాలామంది మంచి సినిమాలు తీసుకుంటూ హిట్స్ కొడుతూ ముందుకు వెళ్తుంటే శర్వానంద్ మాత్రం ఒక్క హిట్ కొట్టడానికి చాలా ఇబ్బందులు పడుతున్నట్టు తెలుస్తుంది.

శర్వా ఇండస్ట్రీ కి వచ్చి దాదాపు 20 సంవత్సరాలు కావస్తున్నా కూడా ఇప్పటికి ఒక స్టార్ హీరో రేంజ్ కి వెళ్లలేకపోతున్నాడు.

ఇక ఆయన చేసిన సినిమాలు వరుసగా ప్లాప్ అవుతుంటే చాలా సినిమాల తరువాత వచ్చిన ఒకే ఒక జీవితం సినిమా మంచి హిట్ అయింది.ఈ హిట్ ని కంటిన్యూ చేస్తూ వరుసగా ఒక రెండు, మూడు హిట్లు కొడితే ఆయన మళ్లీ ఒక రేంజ్ లోకి వెళ్ళిపోతారు అలా కాదని మళ్లీ కనక ప్లాప్ పడితే ఇక శర్వా కెరియర్ మళ్లీ డౌన్ అయిపోతుంది ప్రస్తుతం శర్వా శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నట్టు తెలుస్తుంది.

శ్రీరామ్ ఆదిత్య చేసిన లాస్ట్ సినిమా హీరో కూడా యావరేజ్ గా ఆడింది ఇక ఇలాంటి టైములో శర్వా ఆయనకి సినిమా ఇచ్చి సక్సెస్ కొట్టగలడా అంటే చాలా మంది కష్టమే అంటున్నారు.శర్వా కంటే తర్వాత ఇండస్ట్రీ కి వచ్చిన నాని, విజయ్ దేవరకొండ,నిఖిల్ లాంటి హీరోలు సూపర్ హిట్స్ తీసుకుంటూ టాప్ హీరోలుగా ముందుకు వెళ్తున్నారు.

శర్వా మాత్రం అక్కడే ఆగిపోయాడు ఒక మంచి సాలిడ్ హిట్ పడితే కానీ శర్వా ఆ హీరోల రేంజ్ కి వెళ్ళలేడు అని మాత్రం గట్టిగా చెప్పవచ్చు.నెక్స్ట్ వచ్చే రెండు సినిమాలతో మంచి హిట్ కొట్టగలిగితే శర్వా గ్రేడ్ 2 హీరోల్లో టాప్ పొజిషన్ కి వెళ్లగలుగుతాడు లేకపోతే హీరోగా ఆయన కెరియర్ చాలా కష్టం అవుతుంది అని ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది మేధావులు వాళ్ళ అభిప్రాయాలని వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
రైతు పండుగ :నేడు రేవంత్ చెప్పనున్న ఆ రెండు శుభవార్తలు ఏంటి ? 

తాజా వార్తలు